Begin typing your search above and press return to search.

తెలంగాణకి సినిమాని న‌ర‌న‌రాల్లో ఎక్కించాలా!

కానీ ఇటీవ‌ల నిజామాబాద్ లో జ‌రిగిన `సంక్రాంతి వ‌స్తున్నాం` ప్రీరిలీజ్ ఈవెంట్ అక్క‌డెంత చ‌ప్ప‌గా సాగిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Jan 2025 1:30 PM GMT
తెలంగాణకి సినిమాని న‌ర‌న‌రాల్లో ఎక్కించాలా!
X

హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అది శిల్ప‌క‌ళా వేదికైనా... జేఆర్సీ సెంట‌ర్ అయినా? స్టార్ హోట‌ల్ అయినా? నానా క్రామా గూడ గ్రౌండ్ అయినా? ఇస‌కేస్తే రాల‌నంత జ‌నం హాజ‌ర‌వుతుంటారు. ఎంట్రీ గేట్లు కిక్కిరిసిపోతుంటాయి. పార్కింగ్ స్థ‌లాలు కిట‌కిట‌లాడుతాయి. కానీ ఇటీవ‌ల నిజామాబాద్ లో జ‌రిగిన `సంక్రాంతి వ‌స్తున్నాం` ప్రీరిలీజ్ ఈవెంట్ అక్క‌డెంత చ‌ప్ప‌గా సాగిందో తెలిసిందే.

వెంక‌టేష్ స‌హా క్రూ అంతా పాల్గొన్న హైద‌రాబాద్ లో జ‌రిగినంత కిక్ రాలేదు. ఇదే విష‌యాన్ని నిర్మాత‌, నిజామాబాద్ వాసి దిల్ రాజు ఓపెన్ గానే చెప్పారు. ఏపీ లో సినిమా ఈవెంట్ జ‌రిగితే ఓ వైబ్ వ‌స్తుంది..కానీ ఇక్క‌డ అది రాలేదన్నారు. మ‌రి దీన‌ర్దం ఏంటి? అంటే హైద‌రాబాద్ మిన‌హా తెలంగాణలో ఇంక‌క్క‌డా ఈవెంట్ జ‌రిగినా? ప్రేక్ష‌కాభిమానులు హాజ‌ర‌వ్వ‌డం అన్న‌ది చాలా త‌క్కువ‌గానే ఉంటుంద‌ని ఓ అంచ‌నా వినిపిస్తుంది.

మార్కెట్ ప‌రంగా నైజాం చాలా పెద్ద ఏరియా అయినా? సినిమా ప‌బ్లిక్ ఈవెంట్ల‌కు రావ‌డానికి మాత్రం జ‌నాలు అంత‌గా ఆస‌క్తి చూపించ‌ర‌ని తెలుస్తోంది. అయితే ఇక్క‌డ ఇంకా చాలా కార‌ణాలు తెరపైకి వ‌స్తున్నాయి. సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌వాళ్లంతా ఏపీకి చెందిన వారు ఎక్కువ‌గా ఉండ‌టం ఓ కార‌ణ‌మైతే? తెలంగాణ‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సినిమాకు క‌నెక్ట్ అవ్వ‌డం అన్న‌ది జ‌ర‌గ‌దు అన్న‌ది మ‌రో కార‌ణంగానూ వినిపిస్తుంది. అలాగే తెలంగాణ యాస భాష సంస్కృతికి సంబంధించిన సినిమాలు లేక‌పోవ‌డం కూడా మ‌రో ముఖ్య కార‌ణంగా చ‌ర్చ‌కొస్తుంది.

మ‌రి ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డేదెలా? అంటే సినిమా ఈవెంట్లు హైద‌రాబాద్ కే ప‌రిమితం చేయ‌కుండా తెలంగాణ‌లోని ప్ర‌ధాన ప‌ట్టాణాలు టార్గెట్ గా ఈవెంట్లు నిర్వ‌హిస్తే క‌నెక్ట్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంద‌ని ఓ తెలంగాణ నిర్మాత అన్నారు. వ‌రంగల్, ఖ‌మ్మం తో పాటు ముఖ్య ప‌ట్టాణ‌ల్లో ఈవెంట్లు నిర్వ‌హించ‌డంతో పాటు, తెలంగాణ నేప‌థ్యాన్ని ఆధారంగా తీసుకుని చేసే సినిమాల సంఖ్య పెర‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. దీన్ని తెలంగాణ తరుపున దిల్ రాజ్ ముందుండి న‌డిపించాల‌న్నారు. హైద‌ర‌బాద్ సిటీలో భాగ‌మైన పాత‌బ‌స్తీ కెళ్లి అడిగినా తెలుగు హీరోల గురించి మాకు తెలియ‌ద‌నే స‌మాధాన‌మే వినిపిస్తుంది. ఇప్ప‌టికీ అలాగే ఉంది.