Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ ప్లాన్ మారిందా?

హనుమాన్ క్లైమాక్స్ లో అదిరిపోయే సీక్వెన్స్ తో జై హనుమాన్ టైటిల్ తో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:58 AM GMT
ప్రశాంత్ వర్మ ప్లాన్ మారిందా?
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ హనుమాన్. చిన్న సినిమాగా వచ్చి భారీ లాభాలని ఈ చిత్రం అందించింది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసింది. ఇండియాలో సూపర్ హీరో కథలకి మంచి డిమాండ్ ఉంటుందని హనుమాన్ ప్రూవ్ చేసింది. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

హనుమాన్ క్లైమాక్స్ లో అదిరిపోయే సీక్వెన్స్ తో జై హనుమాన్ టైటిల్ తో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. దీంతో సీక్వెల్ పైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ప్రశాంత్ వర్మ ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. స్క్రిప్ట్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో నటిస్తాడని ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే అతను ఎవరనేది రివీల్ చేయలేదు.

దీంతో చాలా మంది పేర్లు తెరపైకి వస్తూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రానా పేరు ఆరంభంలో వినిపించింది. తరువాత బాలీవుడ్ స్టార్ అంటూ ప్రచారం జరిగింది. రాకింగ్ స్టార్ యష్ హనుమంతుడిగా కనిపిస్తాడు అంటూ కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్. ప్రశాంత్ వర్మ అయితే ఎవరి పేరు నిర్ధారించలేదు. ఈ మూవీ ఇప్పుడు మొదలుపెడితే 2025లో వచ్చేస్తుందని అందరూ భావించారు.

తాజాగా తేజా సజ్జా ఈ మూవీపై స్పష్టత ఇచ్చారు. జై హనుమాన్ మూవీ ఎప్పుడు రాబోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే చేస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకి లేదని సమాధానం చెప్పారు. ఆ సినిమా రావడానికి సమయం పడుతుందని, ఈ లోపు నేను వేరే ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకి వస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తేజా సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఒక సినిమా చేస్తోంది. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

దీని తర్వాత కూడా తేజా సజ్జా ఇంకో సినిమా చేయబోతున్నాడని టాక్. జై హనుమాన్ భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ హై ఎండ్ లో ఉండనున్నాయంట. అందుకే కనీసం ఈ మూవీ రావడానికి రెండేళ్లు పట్టొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. అన్ని కరెక్ట్ గా సెట్ అయితే 2026లో జై హనుమాన్ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం ఉండొచ్చు.