Begin typing your search above and press return to search.

సీనియర్ యాక్టర్ బ్రేకప్ లవ్ స్టోరీ.. క్లారిటీ ఇదే..!

సీరియల్స్ లో నటించి సినిమాల్లో ఛాన్స్ అందుకున్న సీనియర్ యాక్టర్ పృధ్వీరాజ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు.

By:  Tupaki Desk   |   18 March 2024 8:26 AM GMT
సీనియర్ యాక్టర్ బ్రేకప్ లవ్ స్టోరీ.. క్లారిటీ ఇదే..!
X

సీరియల్స్ లో నటించి సినిమాల్లో ఛాన్స్ అందుకున్న సీనియర్ యాక్టర్ పృధ్వీరాజ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. కెరీర్ మధ్యలో కొన్నాళ్లు వెనుక పడ్డా కూడా ఈమధ్య మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. సినిమాలు సీరియల్స్ తో సిల్వర్ స్క్రీన్ తో పాటుగా బుల్లితెర ఆడియన్స్ కు పృధ్వీరాజ్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల కన్నా మిగతా విషయాలతో పృధ్వీరాజ్ వార్తల్లో ఉంటారు.

పృధ్వీరాజ్ మొదట బీనాను పెళ్లాడాడు. వీరికి అహద్ మోహన్ జబ్బర్ అనే బాబు ఉన్నాడు. అతను ఆటిజంతో బాధపడుతుంటాడు. గొడవల కారణంగా పృధ్వీరాజ్ బీనా నుంచి డైవర్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత తెలుగు అమ్మాయి శీతల్ తో ప్రేమలో పడ్డాడు. శీతల్ తో పృధ్వీరాజ్ ప్రేమాయణం అప్పట్లో హా**ట్ టాపిక్ గా నిలిచింది.

శీతల్ తో పృధ్వీరాజ్ ప్రేమ గురించి మీడియాలో హైలెట్ కాగా 56 ఏళ్ల వయసులో తనకన్నా సగం వయసు ఉన్న శీతల్ తో పెళ్లి చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా శీతల్ నుంచి కూడా పృధ్వీరాజ్ దూరమైనట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని శీతల్ స్వయంగా వెల్లడించింది. శీతల్ ఒంటరిగా కనిపించడం గమనించిన నెటిజన్లు పృధ్వీరాజ్ గురించి అడిగారు. దానికి ఆమె తామిద్దరం విడిపోయామని చెప్పింది. ఇన్ స్టా స్టోరీస్ లో శీతల్ పెట్టిన పోస్ట్ ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చింది.

ఎంతోమంది తన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. పరిస్థితి అర్ధం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. పృధ్వీరాజ్ తో తన పెళ్లి జరగలేదు. మేమిద్దరం సహజీవనం చేశామంతే.. అయితే మేము ఊహించినట్టుగా మా రిలేషన్ షిప్ ముందుకు వెళ్లలేదు. అందుకే ఇద్దరం విడిపోయాం. ఈ ప్రయాణంలో తామిద్దరం సంతోషంగా ఉన్నామని శీతల్ తన స్టోరీలో రాసుకొచ్చింది. అంతేకాదు మా నిర్ణయాన్ని గౌరవిస్తూ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని రిక్వెస్ట్ చేసింది శీతల్.

పృధ్వీరాజ్ తో తన పెళ్లి జరిగిందని.. ఇద్దరిపై వచ్చిన వార్తలకు ఇన్నాళ్లకు స్పందించింది శీతల్. డేటింగ్ సైలెంట్ గా మొదలు పెట్టినా సోషల్ మీడియా వల్ల ఇది అందరికీ తెలిసింది. ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎవరి దారి వారు చూసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది శీతల్. అయితే శీతల్ నుంచి దూరమైన పృధ్వీరాజ్ ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నారు.