ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా! నటుడు పృథ్వీరాజ్
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న నటుడు.
By: Tupaki Desk | 25 Nov 2023 2:30 AM GMT30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న నటుడు. రాజకీయాల్లో నూ యాక్టివ్ గా ఉన్నారు. అక్కడా తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ముద్దుల కుమార్తె శ్రీలిక్ష్మి అలియా స్ శ్రీలు హీరోయిన్ గానూ పరిచయం చేస్తున్నారు. `కొత్త రంగుల` ప్రపంచం అనే సినిమాతో శ్రీలు పరిచయమవుతుంది.
ఈ సినిమాకి తానే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. ఇలా తండ్రీ-కుమార్తెలిద్దరు తొలిసారి కలిసి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తండ్రి-కుమార్తెలు పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూయర్ `మీ కుమార్తెని స్టార్ హీరో ఇంటికి కోడలిగా పంపిస్తు న్నారు? వార్తలొస్తున్నాయి అనగా..పృథ్వీ వెంటనే! ఏమో వెళ్లవచ్చేమో? ఫ్యూచర్ మన చేతుల్లో లేదు కదా అన్నారు. ప్రేమ విషయంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయలు వారికుంటాయి. వాటిని తప్పకుండా గౌరవిస్తాను. పెళ్లి విషయంలో కుమార్తె నిర్ణయానికి కట్టుబడి ఉంటాను` అన్నారు.
అలాగే పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు సరైన ఛాన్సులు కూడా ఇవ్వలేదన్నారు. అవకాశం ఇస్తే కదా? వాళ్లలో ప్రతిభ ఉందా? లేదా? అన్నది తెలిసేది. ఛాన్సే ఇవ్వకుండా పనికిరారు అనడం సహేతుకం కాదు. నా కుమార్తె విషయంలోనే ఇలా ఉంది? అంటే ఇక బయట నుంచి వచ్చే ఆడ పిల్లలు ఎంత బాధపడతారో! ఊహించగం. సినిమా రంగంలో ఆడవారిని కించ పరిచి మాట్లాడకూడదు. వారికి సముచితమైన స్థానం ఇవ్వాలి.
నేను ఎంతో మంది ఆర్టిస్టులతో కలిసి పనిచేసాను. అందరితోనే ఎంతో గౌరవంతో మెలిగాను` అన్నారు. `రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైన సమయంలో నాన్న చాలా బాధపడ్డారు. ఎప్పుడూ ఆయన్ని అంత బాధపడుతుండగా చూడలేదని శ్రీలు అన్నారు. ఆ సమయంలో సూసైడ్ వరకూ వెళ్లారుట కదా? అంటే పృథ్వీ అవునండి అని సమాధానం ఇచ్చారు. ట్యాబ్లెట్లు మింగేద్దా మని...మరోకటి చేద్దామని అనిపించింది. అంతవరకూ వెళ్లాను. కానీ చివరి నిమిషంలో ఆగాను. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఆ ససమయంలో శ్రీలు దగ్గరుండి చూసుకుంది. ఆమె వల్ల చాలా త్వరగా కోలుకున్నాను` అని అన్నారు