Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు నేనంటే చాలా ఇష్టం: పురంధేశ్వ‌రి

టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ పై ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు, ఆయ‌న మేన‌త్త ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   11 March 2025 1:17 PM IST
ఎన్టీఆర్ కు నేనంటే చాలా ఇష్టం: పురంధేశ్వ‌రి
X

టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ పై ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు, ఆయ‌న మేన‌త్త ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పురంధేశ్వ‌రి ఈ వ్యాఖ్య‌లు చేశారు. జూ. ఎన్టీఆర్ తో మీ అనుబంధం ఎలా ఉంటుంద‌ని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు పురంధేశ్వ‌రి స‌మాధానం ఇచ్చారు.

ఎన్టీఆర్ అత్త‌గా న‌న్ను చాలా గౌర‌విస్తారు. నేనంటే అత‌నికి చాలా ఇష్టం. నా కొడుకు, నివేదితాతో ఎన్టీఆర్ రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంటూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటార‌ని, వాళ్లంతా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకుంటార‌ని ఆమె తెలిపారు. సినిమాల ప‌రంగా ఎన్టీఆర్ కు కానీ, క‌ళ్యాణ్ రామ్ కు కానీ తాను ఎలాంటి స‌ల‌హాలివ్వ‌న‌ని పురంధేశ్వ‌రి చెప్పారు.

ఆల్రెడీ వారు సినీ రంగంలో మంచి న‌టులుగా ప్రూవ్ చేసుకుని త‌మ‌కంటూ ఓ స్థాయికి చేరుకున్నార‌ని, వారు చేసిన సినిమాలు బావుండి, న‌చ్చితే ఫోన్ చేసి త‌ప్ప‌కుండా అభినందిస్తాన‌ని పురంధేశ్వ‌రి ఆ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. సంద‌ర్భ‌మొచ్చిన ప్ర‌తీసారీ ఎన్టీఆర్ గురించి మాట్లాడటానికి పురంధేశ్వ‌రి ముందుంటూనే ఉంటారు.

గ‌తంలో కూడా ఎన్టీఆర్ బ‌ర్త్ డే కు స్పెష‌ల్ గా ట్విట్ట‌ర్ లో విషెస్ తెలిపిన పురంధేశ్వ‌రి ఇప్పుడు ఎన్టీఆర్ కు త‌న‌కు మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని బ‌య‌ట‌పెట్టారు. కాగా, నంద‌మూరి ఫ్యామిలో గ‌త కొంత‌కాలంగా కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ట్టు నెట్టింట వార్త‌లొస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ను బాల‌య్య కావాల‌ని దూరం పెడుతున్నార‌ని కూడా అంటారు.

అందుకే బాల‌య్య హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షో కు టాలీవుడ్ లోని స్టార్ హీరోలంద‌రూ వ‌చ్చినా ఎన్టీఆర్ ను మాత్రం తీసుకురాలేద‌ని, బాల‌య్య వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్లే ఆ షో కు ఎన్టీఆర్ ను ఆహ్వానించ‌లేద‌ని అంటారు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య సోద‌రి పురంధేశ్వ‌రి ఎన్టీఆర్ తో ఉన్న బాండింగ్ ను బ‌య‌ట‌పెట్ట‌డం ద్వారా ఆ వార్త‌లకు ఫుల్ స్టాప్ ప‌డే అవ‌కాశ‌ముంది.