Begin typing your search above and press return to search.

పూరి మెంటల్ మాస్ ఏంటో చూపిస్తాడా..?

ఐతే ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు పూరీ సినిమానా అంటే డౌట్ పడే పరిస్థితి ఏర్పడింది.

By:  Tupaki Desk   |   1 April 2025 2:45 AM
పూరి మెంటల్ మాస్ ఏంటో చూపిస్తాడా..?
X

ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు కెరీర్ లో వెనకపడ్డాడు. స్టార్ ని చూసి ఫ్యాన్స్ సినిమాలకు రావడం కామనే కానీ డైరెక్టర్ ని చూసి ఇది పూరీ బొమ్మ అదిరిపోతుంది అని సినిమా చూసేలా తన మార్క్ సెట్ చేసుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఐతే ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు పూరీ సినిమానా అంటే డౌట్ పడే పరిస్థితి ఏర్పడింది. అందుకు తగినట్టుగానే ఆయన సినిమాల ఫలితాలు ఉంటున్నాయి.

లైగర్ ఫ్లాప్ తో పూరీకి ఆఫర్లు కష్టమే అనుకోగా రామ్ తో డబుల్ ఇస్మార్ట్ చేశాడు. ఐతే ఆ సినిమా కూడా డిజాస్టర్ కా బాప్ అయ్యింది. ఇక పూరీని నమ్మి ఏ హీరో డేట్స్ ఇవ్వడం కష్టం అనుకునేలోగా పూరీ ఒక క్రేజీ కాంబో సెట్ చేసుకున్నాడు. ఈసారి కోలీవుడ్ స్టార్ తో పూరీ సినిమా ఉండబోతుంది.

కోలీవుడ్ లో తన సినిమాలతో అలరిస్తూ వస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో పూరీ ఒక క్రేజీ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. పూరీ డౌన్ ఫాల్ గురించి తెలిసి కూడా విజయ్ సేతుపతి ఛాన్స్ ఇవ్వడం ఇక్కడ గొప్ప విషయం. ఐతే పూరీ ఈసారి విజయ్ తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. పూరీ విజయ్ సేతుపతి కలిసి బెగ్గర్ అనే సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో పూరీ తన అసలు సిసలు మెంటల్ మాస్ ఏంటన్నది చూపిస్తాడని అంటున్నారు.

పూరీ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లు ఉన్నారు. ఐతే అదంతా ఒకప్పుడు పూరీ చేసిన సినిమాలు. ఇప్పుడు పూరీ ట్రాక్ తప్పాడని గట్టిగా వినిపిస్తున్న మాట. కానీ మళ్లీ తన ట్రాక్ లోకి వచే కథతోనే ఈసారి పూరీ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నాడని టాక్.

మరి పూరీతో విజయ్ సేతుపతి చేతులు కలిపి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తుంది. ఐతే సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరు.. సినిమా కథ ఏంటన్నది ఇంకా తెలియలేదు.