Begin typing your search above and press return to search.

పూరీ జగన్నాథ్.. ఇప్పుడు ఆ హీరో వెంట?

ఒకప్పుడు డైలాగ్స్ తోనే పూరి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశాడు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 3:30 PM GMT
పూరీ జగన్నాథ్.. ఇప్పుడు ఆ హీరో వెంట?
X

టాలీవుడ్‌లో డిఫరెంట్ స్టైల్ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పూరీ జగన్నాథ్ ఎలాంటి సినిమా చేసినా అందులో హీరో క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఒకప్పుడు డైలాగ్స్ తోనే పూరి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశాడు. ఇక ఇటీవల విడుదలైన 'డబుల్ ఇస్మార్ట్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా, పూరీకి ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఎంత కసిగా చేసినా 'లైగర్' తర్వాత పూరీకి మరో పెద్ద ఫ్లాప్ ఈ సినిమా రూపంలో వచ్చి పడింది.

ఈ నేపథ్యంలో, పూరీ జగన్నాథ్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం హీరోలను ఎంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. సీనియర్ హీరోలు ఇప్పుడు పూరీతో పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడంతో, యువ కథానాయకులను పూరీ టార్గెట్ చేస్తున్నారని సమాచారం. ఇటీవల పూరీ 'డీజే టిల్లు' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డను కలసి, అతనితో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నించాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఆ కాంబినేషన్ కుదరలేదు.

ఇప్పుడు పూరీ జగన్నాథ్ తన దృష్టిని అక్కినేని కుటుంబం వైపు మళ్లించినట్లు సమాచారం. తాజా టాక్ ప్రకారం, పూరీ అఖిల్ అక్కినేని ని తన కొత్త సినిమాలో హీరోగా పెట్టుకోవాలని చూస్తున్నాడట. ప్రస్తుతం వీరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ, అఖిల్ ఈ ప్రాజెక్ట్‌ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

అఖిల్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల అతని సినిమాలు పెద్దగా సక్సెస్ అందించకపోవడంతో, అతను ఇప్పుడు చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజయవంతమైన దర్శకుడితోనే పని చేయడం సేఫ్ అని అనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో పూరీతో చేయడం రిస్క్ అని భావిస్తే ప్రాజెక్టు సెట్టవ్వడం కష్టమే.

ఇదిలా ఉండగా, పూరీ జగన్నాథ్, అఖిల్ తండ్రి నాగార్జునతో గతంలో 'శివమణి' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా బాగా ప్రేక్షకాదరణ పొందింది. దాంతో, అక్కినేని ఫ్యామిలీతో పూరీకి మంచి అనుబంధం ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యం చూస్తే, అఖిల్ పూరీతో చేయడానికి సుముఖత చూపిస్తాడని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. పూరీకి ప్రస్తుతం మంచి హిట్ అవసరం ఉంది. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' వరుస ఫ్లాపుల తర్వాత, ఆయన మరలా సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి యంగ్ హీరోలతో కలిసి కొత్త కథలు అన్వేషిస్తున్నాడు. మరి ఫైనల్ గా తన తదుపరి సినిమాను పూరి ఏ హీరోతో సెట్ చేసుకుంటాడో చూడాలి.