Begin typing your search above and press return to search.

ఆటో జానీ ఆయన కాదంటే ఈయనే..?

చిరుతో చేయాలనుకున్న ఆటో జానీ ఆయన ఈసారి కుదరదని చెబితే మెగాస్టార్ నుంచి కింగ్ నాగార్జునకు షిఫ్ట్ అవుతాడని అంటున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 3:49 AM GMT
ఆటో జానీ ఆయన కాదంటే ఈయనే..?
X

ఒకప్పుడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఈమధ్య పూర్తిగా ఫాం కోల్పోయాడు. ఈ ఇయర్ డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి తన సినిమాతో వచ్చినా ప్రేక్షకులకు అది రుచించలేదు. డైరెక్టర్ గా పూరీ రేంజ్ ని ఒక స్థాయిలో చూసిన ఆడియన్స్ ఆయన ఇప్పుడు ఫేస్ చేస్తున్న వరుస ఫ్లాపులను చూసి ఫీల్ అవుతున్నారు. ఐతే పూరీ కంబ్యాక్ కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూరీ ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ ఈమధ్య పూరీ మెగాస్టార్ చిరంజీవి కాంబోలో చేయాలనుకున్న ఆటో జానీ గురించి హడావుడి మొదలైంది. చిరంజీవికి ఆటో జానీ సెకండ్ హాఫ్ నచ్చలేదని ప్రాజెక్ట్ పక్కన పెట్టాడు. ఐతే పూరీ ఇప్పుడు దాన్ని పూర్తి చేసి చిరుకి నచ్చేలా చేయాలని చూస్తున్నాడట. ఐతే పూరీ ఆటో జానీ చిరుతో చివరి ప్రయత్నం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఈసారి మెగా మనసు మెప్పించేలా సినిమా కన్ ఫర్మ్ చేసుకునేలా పూరీ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. ఐతే పూరీ ఈసారి సెకండ్ ఆప్షన్ ని కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. చిరుతో చేయాలనుకున్న ఆటో జానీ ఆయన ఈసారి కుదరదని చెబితే మెగాస్టార్ నుంచి కింగ్ నాగార్జునకు షిఫ్ట్ అవుతాడని అంటున్నారు. ఆటోజానీగా చిరు కాకపోతే పూరీ జగన్నాథ్ నెక్స్ట్ ఆప్షన్ నాగార్జునే అని తెలుస్తుంది.

పూరీ తో నాగార్జున శివమణి సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తన సినిమాల్లో హీరోకి అంతకుముందు ఇమేజ్ ఎలా ఉన్నా మార్చేస్తాడు పూరీ. అందుకే ఆయనతో పనిచేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. ఒకప్పుడు స్టార్స్ కి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరీ ఇప్పుడు కెరీర్ పరంగా ఈ డౌ ఫాల్ ఊహించలేదు. కానీ మళ్లీ పూరీ కం బ్యాక్ ఇస్తే చూడాలని ఆయన ఫ్యాన్సే కాదు ప్రతి సినీ లవర్ కోరుతున్నాడు. పూరీ హిట్టు కొడితే ఆ సినిమా వసూళ్లు చేసే హంగామాకి బాక్సాఫీస్ దగ్గర మోత మోగిపోవాల్సిందే అని పూరీ ఫ్యాన్స్ అంటున్నారు. మరి అది ఏ సినిమాతో కుదురుతుందో చూడాలి. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నా పూరీ జగన్నాథ్ మాత్రం తన స్టైల్ లో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఐతే బయట కథలతో అయినా పూరీ సినిమా తీసి హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.