Begin typing your search above and press return to search.

పూరి కాంపౌండ్ నుంచి ఛార్మి ఔట్?

ఇదే సమయంలో, పూరి తో పని చేయడానికి ముందున్న కొందరు హీరోలు, "చార్మీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాకూడదు" అనే షరతు పెడుతున్నట్లు కూడా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 March 2025 5:54 PM
పూరి కాంపౌండ్ నుంచి ఛార్మి ఔట్?
X

టాలీవుడ్‌లో పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కాంబినేషన్ గత కొన్ని సంవత్సరాలుగా వేరే లెవెల్‌లో కొనసాగింది. మొదట ఛార్మి హీరోయిన్ గా జ్యోతిలక్ష్మి అనే సినిమాను పూరి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పూరి డైరెక్ట్ చేసిన పలు సినిమాల్లో కూడా ఆమె కనిపించింది. ఇక నటనకు దూరమైన ఛార్మి పూరి దర్శకత్వం వహించే ప్రతి సినిమాలోనూ చార్మీ ప్రొడక్షన్ సైడ్ కంట్రోల్ చేస్తూ వచ్చింది.

కానీ ఇప్పుడు వీరి మధ్య విభేదాలు పెరిగి, వేరువేరుగా ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. లైగర్ ఫ్లాప్ తర్వాత ఈ జోడీ మధ్య బంధం మారిందా.. పూరి కొత్త సినిమాకు చార్మీ భాగం కాకపోతే, దాని వెనుక అసలు కారణం ఏంటి అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ సినిమా అంటే, పూరి కనెక్ట్స్ బ్యానర్ అనేది కామన్‌గా మారింది. అయితే లైగర్ నుంచి ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి.

సినిమా డిజాస్టర్ కావడంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు సమాచారం. అయితే వీటిని పట్టించుకోకుండా పూరి, చార్మీ కలిసి మరో భారీ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ ను అనౌన్స్ చేశారు. ఇక అది కూడా డిజాస్టర్ కావడంతో సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఇక పూరి ప్రొడక్షన్ వైపు వెళ్లకుండా కేవలం డైరెక్టర్ గానే నెక్స్ట్ సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో చార్మీ ప్రొడక్షన్ పార్ట్‌లో లేకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. పూరి తాజా ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఆయన 3-4 కథలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి పూర్తిగా డైరెక్షన్ మీద మాత్రమే దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకోవడం వల్ల గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను మరోసారి అనుభవించకూడదనే ఉద్దేశంతో, కొత్త సినిమాలకు వేరే నిర్మాతలతో కలిసి పని చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

ఇదే సమయంలో, పూరి తో పని చేయడానికి ముందున్న కొందరు హీరోలు, "చార్మీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాకూడదు" అనే షరతు పెడుతున్నట్లు కూడా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే వీరు విడిపోయిన కూడా ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామ్యులు కాబట్టి తేల్చాల్సిన లెక్కలు కొన్ని ఉన్నట్టు టాక్. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ లెక్కలు కూడా తేలాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పరిస్థితులు అన్ని ఇప్పుడు పూరి ఛార్మి మధ్య గ్యాప్ పెంచేశాయి. ఇకపై వీరి జోడీ భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది ఇప్పటికి అంతుపట్టడం లేదు. వీరి మధ్య గ్యాప్ ఏర్పడిందా? లేక కేవలం కొత్త ప్రాజెక్టుల కోసం వేరే బడ్జెట్ పథకాలను అనుసరిస్తున్నారా? అన్నది అధికారికంగా ప్రకటించాల్సిన విషయం.