పూరి జీవితంలో ఓ సంఘటన స్పూర్తితోనా!
ఇటీవలే పూరి జగన్నాధ్ అక్కినేని అఖిల్ కి ఓ స్టోరీ వినిపించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 March 2025 1:13 PM ISTఇటీవలే పూరి జగన్నాధ్ అక్కినేని అఖిల్ కి ఓ స్టోరీ వినిపించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నాగార్జునతో పూరికున్న బాండింగ్ మేరకు పూరి అఖిల్ కి స్టోరీ వినిపించినట్లు వెలుగులోకి వచ్చింది. కానీ ప్రాజెక్ట్ లాక్ అయిందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. అయితే ఆ కథ అఖిల్ కంటే నాగార్జునకు బాగుంటుం దని.. ఆయనకే సెట్ అవుతుందని తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ కాంపౌండ్ వర్గాల నుంచి లీకైంది.
ఇది పూరి శైలికి కాస్త భిన్నమైన స్టోరీ అని... ఓ మారు మూల గ్రామం చుట్టూ తిరిగే కథ అని లీకైంది. హీరో పాత్ర రెండు డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటుందని అంటున్నారు. పూరి ఈ కథని ఓ 20 ఏళ్ల క్రిందకు వెళ్లి రాసినట్లు.. పూర్తి మాస్ కోణంలో ఉంటుందని వినిపిస్తుంది. ఈ కథకు స్పూర్తి పూరి వ్యక్తిగత జీవితమన్నది కూడా తెరపైకి వస్తుంది.
పూరి కథలోకి వస్తే? ఆయన ఓ మారుమూల గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆయన బ్యాలం నుంచి పెరిగి పెద్దయ్యే దశలో తనకు అన్ని రకాల చెడు అలవాట్లు అబ్బాయని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. చిన్నప్పుడు తిరిగిన చెడు తిరుగుళ్లు కారణంగా వ్యక్తిగత జీవితంలో ఇప్పటికీ కొన్ని రకాల అలవాట్లు మార్చలేకపోయానని చెప్పారు. తాజాగా అఖిల్ కి వినిపించిన కథలో ఓ రోల్ దాదాపు అలాగే ఉంటుందని అంటున్నారు.
అన్నీ ఉన్నవాడు కంటే అనాధ అనే వాళ్లు ఎంత పవర్ పుల్ గా ఉంటారు? అన్నది తన కథలో సమాజానికి ఓ గొప్ప సందేశంగా పంపిచబోతున్నాడుట. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. అక్కినేని కాంపౌండ్ కంటే ముందు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా పూరి ఓ సినిమా చేస్తాడనే ప్రచారం సాగింది. `గోలీమార్` కి సీక్వెల్గా ఆ సినిమా ఉంటుందని వినిపించింది. మరి ముందుగా ఏ హీరోతో ముందుకెళ్తారో చూడాలి.