పూరి రాసిన కథల్లో నలుగురు హీరోలు!
పూరి జగన్నాధ్ తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తాడు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు.
By: Tupaki Desk | 8 March 2025 11:00 PM ISTపూరి జగన్నాధ్ తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తాడు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. ఫాంలో ఉన్న హీరోలు ఛాన్స్ ఇవ్వడం కష్టం. అలాగే స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అంతా కూడా ఎవరి ప్రాజెక్ట్ లతో వారు బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పూరికి అవకాశం అంటే మరింత కష్టమైన పనే. మ్యాచో స్టార్ గోపీచంద్ ని లైన్ లోకి తెస్తున్నట్లు వార్తలొచ్చాయి.
`గోలీమార్` కి సీక్వెల్ సిద్దం చేసినట్లు వినిపించింది. అలాగూ అఖిల్ కోసం పూరి వెయిట్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఇందులో వాస్తవం తెలియాలి. అయితే తాజాగా పూరి గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. పూరి మొత్తం నాలుగు స్క్రిప్ట్ లు రెడీ చేసి పెట్టుకున్నట్లు రైటర్ కోన వెంకటే తెలిపారు. ఆ కథలేంటి? అన్నది కూడా తనకు తెలుసునన్నారు. వాటిలో ఒక మంచి కథను ఎంచమని కూడా పూరి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.
ఈ సమాచారాన్ని బట్టి తెలిసిందేంటి? అంటే పూరి సినిమా తీయడానికి రెడీగా ఉన్నాడు. కానీ వాటిలో నటించే హీరోలే కనిపించలేదు. పూరి ఉన్న ఫేజ్ లో స్టార్ హీరోలు ఎలాగూ దొరకరు. టైర్ 2 హీరోలు కూడా రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. పైగా వాళ్లంతా కూడా వేర్వేరు సినిమాలతో సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ ల్లో ఎవరు ఉన్నారో చూసుకుని..వాళ్ల ట్రాక్ రికార్డు చెక్ చేసుకుని ముందుకెళ్తున్నారు.
కాబట్టి టైర్ -2 హీరోలు పూరికి దొరకడం కష్టం. ఇక టైర్ 3 హీరోలు రిస్క్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అఖిల్ ఆ ఛాన్స్ తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. అఖిల్ కోసం పూరి ఓ మంచి మాస్ ఇమేజ్ ఉన్న స్టోరీ సిద్దం చేసాడని వినిపిస్తుంది. పూరి హిట్ ఇస్తే ఎలా ఉంటుంది? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ రికార్డులే తారుమారైపోతాయి. అంతటి ఘనాపాటి పూరి.