పూరి ఎమ్మెల్యే 'తమ్ముడు' కూడా ఇండస్ట్రీలో!
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇండస్ట్రీలో ఎదిగిన వైనం తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఆకాశన్నందుకునే స్థాయికి ఎదిగాడు.
By: Tupaki Desk | 14 March 2024 10:45 AM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇండస్ట్రీలో ఎదిగిన వైనం తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఆకాశన్నందుకునే స్థాయికి ఎదిగాడు. పూరి దర్శకుడిగా సక్సెస్ అయిన తర్వాత అతడి చిన్న తమ్మడు సాయిరాం శంకర్ ని కూడా పరిశ్రమకి తీసుకొచ్చి హీరోని చేసాడు. అతడు హీరోగా కొన్ని సినిమాలు చేసాడు. త్వరలో `వెయ్ దరువెయ్` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అలాగే పూరి తనయుడు ఆకాష్ కూడా హీరో అయ్యాడు. ఆకాష్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి పరిశ్రమకి తీసుకొచ్చింది వీళ్లిద్దరినేనా? అంటే వీళ్లిద్దరి కంటే ముందుగా రెండవ తమ్ముడు ఉమా శంకర్ గణేష్ తీసుకొచ్చాడుట. పూరి ఇండస్ట్రీకి రాగానే అతడితో పాటు గణేష్ ని కూడా తీసుకొచ్చా డుట. కొంత కాలం పూరి వద్దనే ఉన్నాడుట. అప్పుడు గణేష్ కి 21 ఏళ్లు ఉండొచ్చు.
కానీ కొంత కాలం ఉండి మళ్లీ ఊరెళ్లిపోయాడుట. అక్కడ అనుకోకుండా గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాల్సి రావడంతో పోటీ చేయడం గెలవడం జరిగిందిట. అలాగని అతనికి రాజకీయాలంటే ఆసక్తి కాదని కాదు. అప్పుడలా జరిగిందని సాయిరాం శంకర్ తెలిపాడు. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో రాజకీయాల్లో అతడి బ్యాకప్ ని చూసి టికెట్ ఇచ్చి ఎమ్మేల్యేని చేసినట్లు చెప్పుకొచ్చాడు.
తమ కుటుంబం ఈరోజు ఉన్నత స్థానంలో ఉందంటే దానికి కారణం పూరి అన్నయ్యేనని సాయిరాం తెలిపాడు. తనకి సక్సెస్ లేకపోతే తమకి ఎలాంటి ఐడెంటిటీ ఉండేది కాదని...సాధారణ జీవితం ఉండేదని తెలిపాడు. సాయిరాం శంకర్ తొలి సినిమా `143`ని పూరి జగన్నాధ్ స్వీయా దర్శకత్వంలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సాయిరాంకి ఇండస్ట్రీలో అవకాశాలొచ్చాయి. ప్రస్తుతం ఉమాశంకర్ గణేష్ వైకాపా పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.