Begin typing your search above and press return to search.

పూరి కి ఆ సినిమా పంచాయితీ తీరేదెలా ?

దీంతో నిర్మాత‌ల్లో ఒక‌రైన చార్మి లైగ‌ర్ న‌ష్టాల్లో 40 శాతం చెల్లిస్తామ‌ని చెప్పింది. అంటే 16 కోట్లు ఇచ్చేలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   11 Aug 2024 7:30 AM GMT
పూరి కి ఆ సినిమా పంచాయితీ తీరేదెలా ?
X

'లైగ‌ర్' రిలీజ్ ముందు వ‌ర‌కూ పూరి జ‌గ‌న్నాధ్ సినిమాలంటే డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు ఎగ‌బ‌డి కొని రిలీజ్ చేసేవారు. హీరోని చూసి కాదు..పూరి అనే బ్రాండ్ ని చూసి క‌ళ్లు మూసుకుని కంటెంట్ తీసుకుని రిలీజ్ చేసేవారు. కొన్ని ద‌శాబ్ధాల పాటు పూరి కంటెంట్ అంటే అంత న‌మ్మ‌కంతో సాగింది. అలాగ‌ని ఇప్పుడు న‌మ్మ‌కం కోల్పోయర‌ని కాదు. కానీ 'లైగ‌ర్' తెచ్చిన విప‌త్తుతో ఇప్పుడా ప్ర‌భావం 'డ‌బుల్ ఇస్మార్ట్' పై ప‌డుతుంది.

'లైగ‌ర్' ప్లాప్ కి సంబంధించి ఇంకా సెంటిల్ మెంట్ జ‌ర‌గ‌ని సంగ‌తి తెలిసిందే. ఇప్పుడ‌దే పూరి అండ్ కోకి త‌ల‌నొప్పిగా మారింది. ఈ పంచాయ‌తీ ఎంత‌కు దారి తీస్తుందా? అన్న అందోళ‌న యూనిట్ లో క‌నిపిస్తుంది. చిత్రాన్ని ఈనెల 15న రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ త‌మ‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు చెల్లించ‌క‌ పోతే ఏజిల్లాలోనూ పోస్ట‌ర్ కూడా ప‌డ‌ద‌నే బెదిరింపులు వెళ్తున్నాయి.

దీంతో నిర్మాత‌ల్లో ఒక‌రైన చార్మి లైగ‌ర్ న‌ష్టాల్లో 40 శాతం చెల్లిస్తామ‌ని చెప్పింది. అంటే 16 కోట్లు ఇచ్చేలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కానీ ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. ఆ న‌ల‌భై శాతం సినిమా రిలీజ్ త‌ర్వాత చెల్లిస్తామ‌ని చార్మి అంటుందిట‌. దానికి డిస్ట్రిబ్యూటర్‌లు ఒప్పుకోవ‌డం లేదుట‌. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే రిలీజ్ త‌ర్వాత బ‌కాయిలు చెల్లించ‌డం అన్న‌ది గాల్లో మాట‌గా పంపిణీదారులు కొట్టిపారేస్తున్నారు.

ఒక‌వేళ చార్మీ కండీష‌న్ ప్ర‌కారం రిలీజ్ జ‌ర‌గాలంటే మ‌ధ్య‌లో హోల్‌సేల్ కొనుగోలుదారు నిరంజన్ రెడ్డిని గ్యారంటర్‌గా ఉండ‌మంటున్నారుట‌. ఈ కండీష‌న్ కినిరంజ‌న్ రెడ్డి ఒప్పుకుంటారా? లేదా? అన్న‌ది అత‌ని ఇష్టం మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌స్తుతానికి స‌మ‌స్య అలా ఉంది. రిలీజ్ కి ఇంకా మూడు రోజులే స‌మ‌స్య ఉంది. ఈ వ్య‌వ‌ధిలోనే సంగ‌తేంటి? అన్న‌ది తేలాలి. తెలుగురాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది.

ప్ర‌త్యేకంగా తూర్పుగోదావ‌రి జిల్లాలో మాత్రం మ‌రింత క‌ఠినంగా ఉంది. బకాయిలు పూర్తిగా చెల్లించకుంటే జిల్లాలో సినిమా పోస్టర్లు కూడా వేయ‌నియ్య‌మ‌ని తేల్చి చెప్పారుట‌.