Begin typing your search above and press return to search.

మరో పైసా వసూల్ కాంబోనా..?

ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. హీరోలను స్టార్స్ గా తీర్చిదిద్దిన చరిత్ర ఆయనది

By:  Tupaki Desk   |   19 Aug 2024 8:12 AM GMT
మరో పైసా వసూల్ కాంబోనా..?
X

ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. హీరోలను స్టార్స్ గా తీర్చిదిద్దిన చరిత్ర ఆయనది. అయితే ఇప్పుడు ఆ పూరీ కనిపించట్లేదు. ఆయన సినిమాలు అంచనాలను అందుకోలేకపోతున్నాయి. పూరీ జగన్నాథ్ ఫాం లోకి రావాలని ప్రతి సినీ ప్రేమికుడు అనుకుంటున్నాడు. రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ మళ్లీ నిరాశ పరిచాడు. పూరీ మార్క్ టేకింగ్ ఉన్నా ఎందుకో సినిమాను ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

ఐతే లైగర్ తర్వాత పూరీ కి ఎవరు ఛాన్స్ ఇస్తారా అనుకుంటే రామ్ డబుల్ ఇస్మార్ట్ ఛాన్స్ ఇచ్చాడు. ఐతే ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ రిపీట్ అవుతుంది అనుకుంటే అది కాస్త రివర్స్ అయ్యింది. ఐతే డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీకి ఎవరు ఛాన్స్ ఇస్తారన్నది డిస్కషన్ మొదలైంది. ఫ్లాపుల్లో ఉన్న పూరీని డైరెక్ట్ చేయాలంటే ఈ టైం లో రిస్క్ అన్నట్టే అని హీరోలు ఫీల్ అవుతున్నారు. అయితే ఒక హీరో మాత్రం పూరీతో చేసేందుకు రెడీ అంటున్నాడట.

పూరీ తో ఆల్రెడీ పైసా వసూల్ సినిమా చేసిన బాలకృష్ణ మరో సినిమాకు ఓకే చెప్పాడని లేటెస్ట్ టాక్. కొంతమంది హీరోలు డైరెక్టర్స్ హిట్లు, ఫ్లాపులు లెక్కలోకి తీసుకోరు. కేవలం వారి డైరెక్షన్ టాలెంట్ మాత్రమే చూస్తారు. పూరీ ఫ్లాపుల్లో ఉన్నప్పుడే పైసా వసూల్ ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ఐతే పూరీ కి మళ్లీ మరో ఛాన్స్ ఇస్తున్నాడట. ఈ మధ్యనే బాలకృష్ణని కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీ వినిపించాడట పూరీ. స్టోరీ నచ్చడంతో చేసేద్దాం అని అన్నారట.

బాలయ్య పూరీ అంటే మరో పైసా వసూల్ సినిమా వస్తున్నట్టే లెక్క. ఈమధ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలయ్య బాబు ప్రస్తుతం కె ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య బోయపాటితో అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. పూరీ సినిమా ఓకే అయినా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తుంది. ఐతే పూరీ అప్పటిదాకా వెయిట్ చేస్తాడా మరో హీరోతో సినిమా చేస్తాడా అన్నది చూడాలి.