డబ్బులిస్తామన్నా తోడుగా ఎవరూ ఉండరు!
పూరి తల్లి స్వగ్రామం బాపిరాజు కొత్త పల్లి లో ఓ పెద్ద ఇంట్లో ఉంటున్నారు. జీవితం అన్ని రకాలుగా సంతో షంగా ఉన్నా అదే ఇంట్లో ఒంటరిగా ఆ తల్లి ఉంటున్నారు.
By: Tupaki Desk | 29 Feb 2024 8:15 AM ISTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తల్లి అమ్మాజి ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ ఇంటర్యూతో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తనయుడు సక్సెస్..కష్టనష్టాలన్నింటి గురించి ఆ తల్లి చెబుతుంటే? పూరి అభి మానులు మరోసారి ఎంతో గర్వపడ్డారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన పూరి అంత గొప్ప వాడు? అయ్యాడంటే నిజంగా గ్రేట్ అంటూ పూరి పనితనాన్ని ప్రశంసిస్తున్నారు. పూరి మాట్లాడే ప్రతీ మాట వెనుక ఓ అనుభవం ఉందనే సంగతి అర్ధమవుతుంది.
మరి అంత గొప్ప కొడుకుని కన్న తల్లి ఇంకెంత గర్వంగా ఫీలవుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ సంగతి పక్కనబెడితే పూరికి సక్సెస్ వచ్చిన తర్వాత లైఫ్ ని తనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుని ముందుకె ళ్తున్నాడు. పూరి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తమ్మడు గణేష్ ఎమ్మెల్యే కావడంతో నర్సీపట్నంలోనే నివాసముంటున్నాడు. సాయిరాం శంకర్ కూడా పూరితో పాటు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు.
పూరి తల్లి స్వగ్రామం బాపిరాజు కొత్త పల్లి లో ఓ పెద్ద ఇంట్లో ఉంటున్నారు. జీవితం అన్ని రకాలుగా సంతో షంగా ఉన్నా అదే ఇంట్లో ఒంటరిగా ఆ తల్లి ఉంటున్నారు. ఇంట్లో పనివారు..చుట్టూ పలకరించే వారు ఉన్నా అదంతా సాయంత్రం వరకే. సాయంత్రం అయ్యే సరికి పనివాళ్లు ఎవరు ఉండరుట. ఇంట్లో ఆమె తల్లి ఒక్కరే ఉంటారు. తోడుగా ఎవరినైనా ఉండమన్నా? జీతం ఇస్తాం ఉండమన్నా ఆ పల్లెటూరు వారు ఎవరూ ముందుకు రావడం లేదుట.
ఈ విషయాన్ని పూరి తల్లి రివీల్ చేసారు. పదిరోజులకు ఒకసారి పూరి తప్పకుండా ఫోన్ చేసి మాట్లాడు తాడుట. వీలు కుదిరినప్పుడు పూరి సొంతూరు వెళ్తుంటాడుట. అయితే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో సమీపంలోనే ఓ హోటల్ లోనే ఉంటాడుట. అప్పటికే పూరి కోసం అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో అభిమానులకు ఫోటోలు ఇవ్వడానికి పూరికి సమయం సరిపోదుట. ఉన్నన్ని రోజులు అందరికీ ఫోటోలు ఇచ్చి పంపిస్తాడుట. అభిమానులంటే పూరి ఎంతో గౌరవిస్తాడని..వాళ్లు లేనిదే ఏది లేదని అంటుటాడని` అన్నారు.