పూరి కూడా చెక్కడం మొదలు పెట్టాడా?
వేగంగా రాయడం..తీయడంపై అతనో ఎక్స్ పర్ట్. సీరియల్స్ కి పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో? పనితనంలో వేగం పెరిగిందని అంటాడు పూరి
By: Tupaki Desk | 6 July 2024 6:06 AM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమా అంటే రెండు నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది. అటుపై మరో నాలుగు నెలలు మిగతా పనుల కోసం సమయం తీసుకుంటారు. మొత్తంగా ఆరు నెలల్లో అన్ని పనులు చుట్టేసి రిలీజ్ చేయడం అన్నది పూరి స్టైల్. అదంతా ఈజీ కాదు. పూరి వర్కాహాలిక్. వేగంగా రాయడం..తీయడంపై అతనో ఎక్స్ పర్ట్. సీరియల్స్ కి పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో? పనితనంలో వేగం పెరిగిందని అంటాడు పూరి.
అతని పనితనాన్ని మెచ్చి దర్శక దిగ్గజం రాజమౌళి సైతం పూరి వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తాను? అన్నా రంటే పూరి గొప్పతనం గురించి చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమా నుంచి మొన్నటి ఇస్మార్ట్ శంకర్ వరకూ పూరి ఇదే శైలిలో పనిచేసుకుంటూ వచ్చారు. అయితే వైఫల్యాలు పూరిని పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రామ్ తో `డబుల్ ఇస్మార్ట్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ కి వెళ్లి చాలా కాలమవుతోంది.
కానీ ఇంతవరకూ షూటింగ్ పూర్తి కాలేదు. తాజాగా షూటింగ్ పూర్తయిందంటూ ఓ అప్ డేట్ వచ్చింది. దీంతో ఈ సినిమాని పూరి ఎంతగా చెక్కుతెన్నాడో? అద్దం పడుతుంది. ఇంత సమయం ఏ సినిమాకి తీసుకోలేదు. తొలిసారి ఎక్కువ టైమ్ తీసుకుని చేసిన సినిమా ఏది? అంటే అది ఇదేనని చెప్పాలి. వైఫల్యాల నేపథ్యంలో పూరి సతీమణి కూడా నెమ్మదిగా తీయమని సలహా ఇచ్చారు.
ఈ విషయంలో పూరి ఆమె సలహాని కూడా పాటిస్తూ ముందుకెళ్తున్నారు. పూరికి ఈ సక్సస్ చాలా కీలకం. గత సినిమా లైగర్ ఎలాంటి అనుభవాన్ని అందించిందో తెలిసిందే. సినిమా ప్లాప్ అవ్వడంతో పంపిణీ దారులతో పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చింది. ఆ విమర్శలన్నింటికీ డబుల్ ఇస్మార్ట్ తో పుల్ స్టాప్ పెట్టాల్సి ఉంది. అందుకే పూరి కంగారు పడకుండా నెమ్మదిగా ఈ సినిమా చేస్తున్నారు.