Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. పూరి బ్యూటీఫుల్ ప్లాన్

ప్రస్తుతం నోరా ఫతేహి బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   16 July 2024 7:17 AM GMT
డబుల్ ఇస్మార్ట్.. పూరి బ్యూటీఫుల్ ప్లాన్
X

పూరి జగన్నాథ్ సినిమాలంటే ఐటెం సాంగ్స్ బాగా గుర్తుకొస్తాయి. అతని ప్రతి సినిమాలో కచ్చితంగా ఐటెం సాంగ్ ఉంటుంది. వాటి కోసం ప్రత్యేకంగా గ్లామర్ అండ్ హాట్ బ్యూటీస్ ని పూరి జగన్నాథ్ వెతికి మరీ తీసుకొస్తాడు. అలా పూరి జగన్నాథ్ సినిమాలలో ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన బ్యూటీస్ అంటే ముమైత్ ఖాన్, శ్వేతా భరద్వాజ్, నోరా ఫతేహి లాంటి వారు కనిపిస్తారు.

ప్రస్తుతం నోరా ఫతేహి బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. లైగర్ సినిమాకి పూరి జగన్నాథ్ స్టైల్ మార్చాడు. ఆ సినిమాలో అనన్యా పాండేని చాలా గ్లామర్ గా చూపించారు. ఆమె బేసిక్ గా హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. లైగర్ సినిమాలో సాంగ్స్ లో రెగ్యులర్ హీరోయిన్స్ తరహాలో కాకుండా మరింత హాట్ డోస్ పెంచి అనన్యా పాండేని పూరి రిప్రజెంట్ చేశాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పూరి జగన్నాథ్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బని జె మరో హీరోయిన్ గా చేసింది. కావ్య థాపర్ మెయిన్ హీరోయిన్ కావడంతో రామ్ తో ఆమె డ్యూయెట్స్. మాస్ బీట్స్ కి స్టెప్పులేసింది.

ముఖ్యంగా చోర్ చింత మార్ ముంత సాంగ్ ప్రోమోలో అందాల ప్రదర్శనతో అదరగొట్టింది. ఓ విధంగా ఈ సాంగ్ కి కావ్య థాపర్ ని ఐటెం గర్ల్ రేంజ్ లో పూరి జగన్నాథ్ ఉపయోగించుకున్నాడు. ఆమెతో ఐటెం బ్యూటీ రేంజ్ లోనే సాంగ్ లో డాన్స్ అండ్ గ్లామర్ షో చేయించారు. ఈ మాస్ సాంగ్ ప్రోమో సోషల్ కూడా వైరల్ అవుతోంది. కావ్య థాపర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలోకి భారీ బడ్జెట్ చిత్రం ఇదే కావడం విశేషం.

కమర్షియల్ హీరోయిన్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆమెని మరో మెట్టు ఎక్కిస్తుందని చాలా నమ్మకంగా ఉంది. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన బని జె తిక్క మూవీలో కీలక పాత్రలో చేసింది. అలాగే హిందీ లో కొన్ని ప్రాజెక్ట్స్ లో కనిపించింది. ఫోర్ మరి షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ కి బని జె కి మంచి గుర్తింపు వచ్చింది. అజిత్ వాలిమై సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు ఏకంగా పూరి జగన్నాథ్ సినిమాలో లీడ్ రోల్ లో ఛాన్స్ అందుకుంది. సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతూ ఉండటం విశేషం.