Begin typing your search above and press return to search.

మేధావిలా నటించడం మానేయండి: పూరీ జగన్నాథ్‌

''నీ కాంపిటీటర్స్ అందరినీ శత్రువుల్లా చూడటం మానేయాలి.. సీనియర్స్‌లా చూడండి. వాళ్లతో ఫ్రెండ్ షిప్ చేయండి. వాడూ నువ్వూ ఒకే బిజినెస్‌ చేస్తున్నా, వాడి కంటే నీకు తక్కువ తెలుసని అవతలి వాడు అనుకోవాలి.

By:  Tupaki Desk   |   25 Nov 2024 2:04 PM GMT
మేధావిలా నటించడం మానేయండి: పూరీ జగన్నాథ్‌
X

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ గ్యాప్ లో ‘పూరి మ్యూజింగ్స్’ ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. రోజుకో కొత్త అంశంపై తన ఐడియాలజీని వినిపిస్తున్నారు. తాజాగా ‘ప్లే ఫూలిష్‌’ అనే టాపిక్ పై మాట్లాడారు పూరీ. ఎప్పుడూ అన్నీ తమకే తెలిసినట్లు మాట్లాడవద్దని, ఎప్పుడూ బిగినర్స్‌ మైండ్‌ సెట్‌లో ఉండాలని, అలా చేస్తే అవతలి వాళ్ళ స్ట్రాటజీలు కూడా తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. అదే అన్నీ తెలిసినట్లు మాట్లాడితే అవతలి వాళ్ళ దృష్టిలో అహంకారిగా కనిపిస్తావని పేర్కొన్నారు.

''ద ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఫూలిష్‌. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో సక్సెస్‌ అవ్వడానికి చాలా మంది సైకాలజిస్ట్‌లు చెప్పే థియరీ.. ప్లే ఫూలిష్‌. మీ బిజినెస్‌ లో కావొచ్చు, వర్క్ ప్లేస్ లో కావొచ్చు. చాలా మందితో మీకు పోటీ ఉంటుంది. మీ కంటే సీనియర్స్‌ ఉంటారు.. ఎక్స్ పీరియన్స్ ఉన్నవాళ్లు లేదా మీ కంటే బాగా సక్సెస్ అయినవాళ్ళు ఉంటారు. వాళ్లందరినీ స్మూత్ గా హ్యాండిల్ చేసే థియరీ ప్లేయింగ్ ఫూలిష్‌. అంటే నిజంగానే ఫూల్‌లా ఉండటం కాదు. వాళ్ల ముందు తక్కువ నాలెడ్జ్‌ ఉన్న వాడిలా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరు ఇంకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతుంది. అవతలి వాడు చెప్పే మాటలు వినడం నేర్చుకుంటే, మనం ఎంత వరకూ మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? అనేది అర్థం అవుతుంది''

''నీ కాంపిటీటర్స్ అందరినీ శత్రువుల్లా చూడటం మానేయాలి.. సీనియర్స్‌లా చూడండి. వాళ్లతో ఫ్రెండ్ షిప్ చేయండి. వాడూ నువ్వూ ఒకే బిజినెస్‌ చేస్తున్నా, వాడి కంటే నీకు తక్కువ తెలుసని అవతలి వాడు అనుకోవాలి. ఇదేమీ మానిప్యులేటివ్ టాక్టిక్ కాదు. మేధావిలా నటించడం మానేయండి. మీరు తక్కువ కేపబుల్ గా కనిపించినప్పుడు అవతలి వాడు మీ మీద ఫోకస్‌ పెట్టడు. మీకు తెలిసినా సరే, కొన్ని బేసిక్స్ చెప్పమని అడగండి. అలా అడిగితే అవతలి వాడు ఆనందంగా సమాధానం చెప్తాడు. వాడు ఏమనుకుంటున్నాడో వినాలి. అలా వింటే ఎక్కువ నేర్చుకుంటాం. మీ వల్ల వాళ్ళకి ఇబ్బంది లేదని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అలా అయితే ఒక్కోసారి వాళ్ళ ఇంటెన్షన్స్, స్ట్రాటజీలు కూడా మీతో షేర్‌ చేసుకునే అవకాశం ఉంటుంది''

''ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో నెగోషియేషన్స్ చేయాలంటే నాలెడ్జ్ చాలా అవసరం. అది నీ సీనియర్స్‌ నుంచి, కాంపిటీటర్స్ నుంచి గెయిన్ చేయగలిగితే.. అంతకంటే కావాల్సింది ఏముంది. వాళ్ళ స్కిల్స్ ఏంటో అర్థమవుతాయి. అందుకే మీ డోర్ ఎప్పుడూ తెరిచే ఉండాలి. ఎవరైనా నేర్పిస్తే నేర్చుకుంటాను అనేలా ఉండాలి. దీని వలన వారితో మీకు మంచి రిలేషన్ ఏర్పడుతుంది. నీకే అన్నీ తెలిసినట్లు మాట్లాడితే అవతలి వాడు ఏదీ నీతో షేర్ చేసుకోడు. పైగా వాడి దృష్టిలో నువ్వు అహంకారిగా కనిపిస్తావు. ఆ తర్వాత వాడికి ఎనిమీ అయిపోతావు. అందరితో శత్రుత్వం ఎందుకు?''

''అలానే ఏ విషయానికైనా ఎదుటివారిని లీడ్ చేయమని అడగండి. అలా చేస్తే వాళ్ళ లైఫ్ లో మీరు సపోర్టింగ్ పర్సన్ అవుతారు. సోక్రటీస్‌ ఒక మాట చెప్పాడు. ‘నాకు తెలిసింది ఏంటంటే.. నాకు ఏమీ తెలియదని’. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడూ బిగినర్స్ మైండ్ సెట్ తో ఉండాలి. అబ్రహాం లింకన్ ఎప్పుడూ ఇలాంటి మైండ్ సెట్ తోనే ఉండేవాడంట. దాని వల్ల అతని చుట్టూ ఉన్నవారందరి మనసులో ఏముందో ఆయనకు తెలిసేది. ఎదుటివారి విజ్ డమ్ ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. వారిని మాట్లాడనివ్వండి. మీకు ఎన్నో స్ట్రాటజీలు అర్థమవుతాయి. ప్లేయింగ్ ఫూలిష్‌ అనేది పవర్‌ ఫుల్‌ టూల్. మీరు గాని ఈ ఆర్ట్‌లో మాస్టర్‌ చేయగలిగేతే, ఒక లెర్నర్ గా లీడర్ గా మంచి పొజిషన్ లో ఉంటారు'' అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.