Begin typing your search above and press return to search.

కింగ్ ని లైన్ లో పెడుతోన్న పూరి!

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్- కింగ్ నాగార్జున్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   20 May 2024 11:30 PM GMT
కింగ్ ని లైన్ లో పెడుతోన్న పూరి!
X

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్- కింగ్ నాగార్జున్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఇద్ద‌రు క‌లిసి రెండు సినిమాలు చేసారు. వాటిలో `సూప‌ర్` యావ‌రేజ్ గా ఆడినా..`శివ‌మ‌ణి` మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. కానీ ఆ త‌ర్వాత ఆద్వ‌యం మ‌ళ్లీ చేతులు క‌లిపింది లేదు. ఎవ‌రి ప్రాజెక్ట్ లు వారు చేసుకున్నారు త‌ప్ప క‌లిసి సినిమా చేయలేదు. దీంతో రెండు ద‌శాబ్ధాల త‌ర్వాత మ‌ళ్లీ ఆ కాంబోలో సినిమా సెట్ అవుతున్న‌ట్లు ఓ వార్త లీక్ అయింది.

ఈ మ‌ధ్య‌నే పూరి అన్న‌పూర్ణ స్టూడియో లో నాగార్జున‌ని క‌లిసి లైన్ వినిపించారుట‌. న‌చ్చ‌డంతో నాగ్ కూడా ఒకే చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇది పూరి మార్క్ ప‌క్కా యాక్షన్ స్టోరీ అని లీకులందుతున్నాయి. ఈ క‌థకి ఫాంట‌సీ ట‌చప్ కూడా ఉంద‌ని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు `డ‌బుల్ ఇస్మార్ట్` రిలీజ్ అనంత‌రం వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు. ప్ర‌స్తుతం రామ్ హీరోగా పూరి ఆ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల నేప‌థ్యంలో వాయిదా ప‌డిన డ‌బుల్ ఇస్మార్ట్ ని అతి త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్నారు.

అటుపై పూరి నాగ్ స్టోరీపై దృష్టి పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. స్టోరీ పూర్తిగా రెడీ అయితే నాగార్జున కూడా డేట్లు కేటాయించ‌డానికి రెడీగానే ఉన్నారుట‌. ప్ర‌స్తుతం నాగార్జున శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వంలో కుభేర‌లో న‌టిస్తున్నారు. ఇందులో నాగ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర షూటింగ్ కూడా ముగింపు చేరుకుంది. అనంత‌రం త‌మిళ ద‌ర్శ‌కుడు నవీన్ అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నారు. ఇది మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మ‌ని తెలుస్తోంది.

ఈ సినిమాతో పాటు పూరి చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాల‌ని నాగ్ ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. పూరి సినిమా అంటే ఎక్కువ రోజులు డేట్లు కూడా కేటాయించాల్సిన ప‌నిలేదు. రెండు నెల‌ల్లోనూ షూటింగ్ చుట్టేస్తారు. కాబ‌ట్టి న‌వీన్ సినిమా కంటే ఈ చిత్రం వేగంగా షూట్ పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ లోనే నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.