నటిని గర్భంతో పరుగులెట్టించారా?
గర్భవతిగా ఉన్నప్పుడు వర్షంలో రెండు రోజులు షూటింగ్ చేసాం. అందులోనూ రాత్రిపూట షూటింగ్. చలిగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డాను. సహజంగా గర్బవతులకు చల్లనీళ్లు పడవు.
By: Tupaki Desk | 30 Sep 2023 3:30 AM GMTషూటింగ్ లకు గర్భం అడ్దేంకాదంటున్నారు కొందరు నాయికలు. కరీనా కపూర్..అలియాభట్ లు గర్భంతోనే కొన్ని సినిమా షూటింగ్ లు పూర్తిచేసారు. అయితే ఇలాంటి సమయంలో తేలికైన సన్నివేశాల్లోనే చాలా మంది నటిస్తారు. బరువైన సన్నివేశాలైతే లోపల బిడ్డకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రిస్క్ తీసుకోరు. కానీ అలియాభట్ మాత్రం ఏకంగా ఛేజింగ్ సన్నివేశాలే చేసింది. అది హాలీవుడ్ సినిమా కావడంతో రిస్క్ తీసుకుని తన పార్ట్ షూటింగ్ పూర్తిచేసింది.
అయితే మరో నటి పూర్ణ కూడా ఇలాంటి కూడా ఇలాంటి రిస్క్ తీసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మడు నాని నటించిన 'దసరా'లో సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ సమయానికి పూర్ణ నిండు గర్బిణి. కానీ తప్పని పరిస్థితుల్లో షూటింగ్ చేయాల్సి వచ్చిందిట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా షూట్ లో తానెంత ఇబ్బంది పడిందో రివీల్ చేసింది.
గర్భవతిగా ఉన్నప్పుడు వర్షంలో రెండు రోజులు షూటింగ్ చేసాం. అందులోనూ రాత్రిపూట షూటింగ్. చలిగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డాను. సహజంగా గర్బవతులకు చల్లనీళ్లు పడవు. కానీ చలిలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో టీమ్ సభ్యులు వేడినీళ్లు పోస్తున్నా చలిని తట్టుకోవడం కష్టమైంది. సినిమాలో మరో సన్నివేశం రాత్రిపూటే షూటింగ్ జరింది. నిర్మానుష్యమైన రోడ్డులో ఒంటరిగా పరిగెట్టాల్సి వచ్చింది.
ఆ సమయంలో కుక్కలు అరుస్తున్నాయి. భయమేసింది. వచ్చి కరుస్తాయేమోనని కంగారు పడ్డాను. కానీ అలాంటిది జరగలేదు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మరికొన్ని సన్నివేశాలు చేసాను. ఇలా ఇంత కష్టపడి చేస్తే వాటిలో కొన్ని సన్నివేశాలు లేకుండా కట్ చేసారు. చాలా బాధగా అనిపించింది. అయితే షూట్ లో ఎలాంటి గాయాలు కాకుండా యూనిట్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వారు సహకరించ డంతోనే గర్భంతో ఉన్నాదైర్యంగా షూటింగ్ పూర్తి చేయగలిగాను' అని అంది.