పుష్ప 2… కర్ణాటక బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
అంటే కర్ణాటకలో మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే 34 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 20 Nov 2024 4:45 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'పుష్ప 2' డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. ఆల్ మోస్ట్ అన్ని ఏరియాలలో బిజినెస్ కంప్లీట్ అయిపొయింది. థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ కలిపి 1000 కోట్ల బిజినెస్ ఈ సినిమాపై జరిగినట్లు తెలుస్తోంది. ఇండియాలోనే హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా 'పుష్ప 2' రికార్డ్ క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు.
మరోవైపు ఈ చిత్రం మొదటి రోజు 200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అలాగే 'ఆర్ఆర్ఆర్' మూవీ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. అది జరగాలంటే రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్స్ ని వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కర్ణాటక రైట్స్ భారీ ధరకి అమ్ముడయ్యాయి. మూవీ 30 కోట్లకి నాన్ రిఫండబుల్ ఫార్మాట్ లో రైట్స్ ని కొనుగోలు చేసారంట.
వాటితో పాటు అదనంగా అయ్యే ఇన్వెస్ట్మెంట్, ఎక్స్ పెన్సెన్స్ తో కలుపుకొని 33.50 కోట్లకి డీల్ క్లోజ్ అయ్యింది. అంటే కర్ణాటకలో మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే 34 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఇదేమీ పెద్ద టార్గెట్ కాదని బన్నీ అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. 'పుష్ప 2' మూవీ కర్ణాటకలో ఈ స్థాయిలో వసూళ్లని అందుకుందంటే మాత్రం కచ్చితంగా సినిమా సూపర్ హిట్ కేటగిరీలోకి వెళ్ళినట్లేనని ట్రేడ్ పండితులు అంటున్నారు.
అలాగే హిందీలో కూడా 70-80 కోట్ల మధ్యలో మొదటి రోజు ఈ సినిమా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. అలాగే హిందీలో వీకెండ్ అయ్యేసరికి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. పుష్ప మానియా ఉత్తరాది రాష్ట్రాలలో ఆ స్థాయిలో ఉందని సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోన్న మాట. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యి 1000 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరితే మాత్రం అల్లు అర్జున్ మార్కెట్ 500+ కోట్లు క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
సుకుమార్ ఈ సినిమాపై పూర్తిగా ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నాడు. ట్రైలర్ లోనే సుకుమార్ టెక్నీకల్ బ్రిలియన్స్ కనిపించింది. అద్భుతంగా ట్రైలర్ ని ప్రెజెంట్ చేశాడు. ఇందులో చాలా ఐక్యాచ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. పబ్లిక్ అటెన్షన్ ని కూడా ట్రైలర్ స్ట్రాంగ్ గానే గ్రాబ్ చేసింది. నెక్స్ట్ జరగబోయే ప్రమోషన్ ఈవెంట్స్ తో సినిమా పబ్లిక్ లోకి బలంగా వెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారు .