Begin typing your search above and press return to search.

పుష్ప 2: ఎంత వేగంతో వెళుతోందంటే..

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో షూటింగ్ ఫేస్‌లో ఉంది.

By:  Tupaki Desk   |   10 Oct 2024 5:39 AM GMT
పుష్ప 2: ఎంత వేగంతో వెళుతోందంటే..
X

తెలుగు సినీ ప్రేక్షకులే కాకుండా టోటల్ పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "పుష్ప 2: ది రూల్." సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నప్పటికీ డిసెంబర్ 6న పక్కా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా సక్సెస్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, పుష్ప ది రైజ్ విడుదలైనప్పుడు నార్త్ ఆడియెన్స్ నుంచి వచ్చిన క్రేజ్ కారణంగా ఇప్పుడు సీక్వెల్ పై ఆశలను రెట్టింపు చేసింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో షూటింగ్ ఫేస్‌లో ఉంది. ప్రస్తుతానికి ఒకేసారి మూడు చోట్ల నాన్ స్టాప్ షూటింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, కాకినాడ, మారేడుమిల్లి అడవులలో షూటింగ్ జరుగుతోందని సమాచారం. సుకుమార్ పనితీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తన శిష్యుల సహాయం కూడా గట్టిగానే తీసుకుంటున్నాడు.

కొన్ని చిన్న సన్నివేశాలకు వారికి మెగా ఫోన్ ఇస్తున్నట్లు టాక్ వస్తోంది. గతంలో చాలాసార్లు నా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా కొన్ని సీన్స్ ను షూట్ చేసినట్లు సుకుమార్ ఒప్పుకున్నారు. ఎప్పుడూ కూడా చివరి నిమిషం వరకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడం అతని ప్రత్యేకత. అందుకే సుకుమార్ టీమ్ టిమ్స్ ఇప్పుడు ఆఖరి క్షణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేస్తోంది. అల్లు అర్జున్ కూడా పుష్ప 2ని త్వరగా పూర్తి చేసి ప్రమోషన్ల పై పూర్తి దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడు. సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ప్లాన్ చాలా గ్రాండ్‌గా ఉండనుంది, ఎందుకంటే ఈ సారి పుష్ప 2 అన్ని భారతీయ భాషల్లో కూడా భారీగా రిలీజ్ అవుతుంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం ఫహద్ ఫాసిల్ ఎపిసోడ్స్ షూట్ జరుగుతున్నాయి. ఆయనతో వచ్చే కీలకమైన సన్నివేశాలు సినిమా కథలో కీలకంగా ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా లాక్ చేసారు. ఇప్పటికీ మిగిలి ఉన్న ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఐటమ్ సాంగ్. ఈ సాంగ్ ను నవంబర్ నెలలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

పుష్ప-1లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే, అందుకే ఈ సీక్వెల్ లో ఈ ఐటమ్ సాంగ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న పుష్పరాజ్ భార్యగా మళ్లీ ఈ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పుష్ప-2లో ఆమె పాత్ర మరింత సీరియస్‌గా ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ విషయానికి వస్తే, దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలోకి ఎంటర్ టైన్ మెంట్ నింపేలా మంచి సౌండ్ ట్రాక్‌తో ముందుకు వస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సాలీడ్ బిజినెస్ జరుపుకున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో ఎలాగైనా 1000 కోట్ల మార్క్ అందుకోవాలని చూస్తున్నారు. పుష్ప 2 విజయవంతమైతే, పుష్ప సీరిస్ కూడా మరింత పెద్ద స్థాయిలో కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. మరి సుకుమార్ ఈసారి ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తాడో చూడాలి.