Begin typing your search above and press return to search.

పుష్ప 2 - 15 రోజుల కలెక్షన్స్.. లెక్కలు ఎలా ఉన్నాయంటే?

రెండో వారం వీక్ డేస్ లో 12వ రోజైన సోమవారం 20.5, 13వ రోజు 19.5, 14వ రోజు 17, 15వ రోజు 14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ హిందీలో ఈ చిత్రానికి వరుసగా వచ్చాయి.

By:  Tupaki Desk   |   20 Dec 2024 5:17 PM GMT
పుష్ప 2 - 15 రోజుల కలెక్షన్స్.. లెక్కలు ఎలా ఉన్నాయంటే?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ఈ ఏడాదిలో దేశంలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని బీట్ చేసి ఇది నెంబర్ వన్ స్థానంలోకి దూసుకుపోయింది. ఇక హిందీలో కూడా ఈ చిత్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది మొన్నటి వరకు 627 కోట్ల కలెక్షన్స్ తో ‘స్త్రీ 2’ పేరు మీద ఉన్న రికార్డ్ ని ‘పుష్ప 2’ దాటేసింది. 15 రోజుల్లో ఈ చిత్రంలో కేవలం హిందీలోనే 632.5 కోట్ల వసూళ్లు సాధించి టాప్ చైర్ లోకి వచ్చింది.

లాంగ్ రన్ లో ‘పుష్ప 2’ కలెక్షన్స్ హిందీలో 700 కోట్ల మార్క్ ని అందుకుంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రెండో వారం వీక్ డేస్ లో 12వ రోజైన సోమవారం 20.5, 13వ రోజు 19.5, 14వ రోజు 17, 15వ రోజు 14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ హిందీలో ఈ చిత్రానికి వరుసగా వచ్చాయి. అంటే ఇప్పటికి హిందీలో ఈ మూవీ కలెక్షన్స్ నిలకడగా సాగుతున్నాయని చెప్పొచ్చు. తాజాగా ‘బేబీ జాన్’ రిలీజ్ అయిన నేపథ్యంలో కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అయితే ఈ మూవీ టాక్ బట్టి హిందీలో ‘పుష్ప 2’ మూడో వారం కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి.

ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం 15 రోజుల్లో 297.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇందులో 199.15 కోట్ల షేర్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ‘పుష్ప 2’ మూవీపైన 213 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం 14.85 కోట్ల షేర్ వసూళ్లు చేస్తే హిట్ కేటగిరీలోకి వస్తుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

ఇప్పటి వరకు 693.20 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. దీంతో ఇప్పటి వరకు మేకర్స్ కి73.20 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే క్లీన్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. తమిళనాడులో 52 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. అయితే కేవలం ఇప్పటి వరకు 31.90 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. కర్ణాటకలో 32 కోట్ల బిజినెస్ జరగగా 15 రోజుల్లో అక్కడ 48.05 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఇక కేరళలో 20 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కేవలం 7.45 కోట్ల షేర్ మాత్రమే వసూళ్లు అందుకుంది.

హిందీతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 200 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఈ సినిమాపై జరగగా 298.20 కోట్ల షేర్ అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవర్సీస్ లో 100 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పటి వరకు 108.45 కోట్ల షేర్ వచ్చింది. తమిళం, మలయాళీ, తెలుగు భాషలలో ‘పుష్ప 2’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఇంకా అందుకోలేకపోయిన హిందీతో పాటు ఓవర్సీస్, కర్ణాటకలో భారీ లాభాలు రావడంతో సినిమాకి మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రాంతాల వారీగా సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే ఇలా ఉన్నాయి.

నైజాం - 91.16Cr

సీడెడ్ - 29.88Cr

ఉత్తరాంధ్ర - 22.53Cr

తూర్పు గోదావరి - 12.10Cr

పశ్చిమ గోదావరి - 9.38Cr

గుంటూరు - 14.68Cr

కృష్ణా - 12.09Cr

నెల్లూరు - 7.33Cr

ఏపీ&టీజీ టోటల్- 199.15CR (297.45CR గ్రాస్)***

కర్ణాటక - 48.05Cr

తమిళనాడు - 31.90Cr

కేరళ - 7.45Cr

హిందీ+ రెస్ట్ ఆఫ్ ఇండియా - 298.20Cr

ఓవర్సీస్ - 108.45Cr*** అంచనా

టోటల్ ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ - 693.20Cr (1,427.05Cr గ్రాస్)

మూవీ ఓవరాల్ బిజినెస్ - 617Cr

బ్రేక్ ఈవెన్ టార్గెట్ - 620Cr

ప్రాఫిట్ - 73.20Cr - హిట్