ప్రీ బుకింగ్స్.. చరిత్ర సృష్టించేందుకు పుష్ప సిద్ధమైనట్లే!
కేవలం సగం రోజులో పుష్ప సీక్వెల్ హిందీ వెర్షన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.5 కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది.
By: Tupaki Desk | 1 Dec 2024 5:32 PM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 పై ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో అందరికీ తెలిసిందే. నిజానికి.. ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో సీక్వెల్ అనౌన్స్మెంట్ నుంచే మంచి బజ్ నెలకొంది. ఆ తర్వాత మేకర్స్ దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో వేరే లెవెల్ కు తీసుకెళ్లిపోయారు.
ఇక కొద్ది రోజులుగా వరుస ఈవెంట్స్ నిర్వహిస్తూ.. సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు మేకర్స్. అలా మూవీని కచ్చితంగా చూడాలనేంతగా బజ్ క్రియేట్ చేశారు. దీంతో కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా పుష్ప సీక్వెల్ కోసమే చర్చ నడుస్తోంది. ఈసారి సుక్కూ, బన్నీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని మాట్లాడుకుంటున్నారు.
ఓవర్సీస్ లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా.. దేశంలో ఇప్పుడు ఒక్కో చోట స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో జోరుగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. అదే సమయంలో నార్త్ లో కనీవినీ ఎరుగని స్థాయిలో బుకింగ్స్ కు రెస్పాన్స్ వస్తోంది.
కేవలం సగం రోజులో పుష్ప సీక్వెల్ హిందీ వెర్షన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.5 కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది. దీంతో నార్త్ లో పుష్ప దూకుడు చూస్తుంటే.. ప్రీ బుకింగ్స్ ద్వారానే మూవీ రూ.30 కోట్ల నెట్ కలెక్షన్సు సాధించేలా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని అంటున్నారు.
బాలీవుడ్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పుష్ప 2 కచ్చితంగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న జవాన్ రికార్డును బద్దలు కొడుతుందని అంటున్నారు. చిన్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కూడా జోరుగా పుష్ప సీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నడూ లేని విధంగా పంజాబ్ లో కూడా వేరే లెవెల్ ప్రీ సేల్స్ పుష్ప సినిమాకు గాను జరుగుతున్నట్లు సమాచారం. షాకింగ్ గా తమిళనాడులో కూడా పుష్ప రాజ్ మ్యానియా కనిపిస్తోంది. దీంతో విడుదలకు ముందే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న పుష్ప 2.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైనట్లే.