యూఎస్ లో పుష్ప రాజ్ రచ్చ.. రికార్డుల కోత మొదలైంది
ఇదిలా ఉంటే యూఎస్ లో 'పుష్ప 2' ప్రీమియర్ షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.
By: Tupaki Desk | 3 Nov 2024 4:18 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2' డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి వస్తోంది. అంతకంటే ఒకరోజు ముందుగానే యూఎస్ లో ఈ మూవీ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా వివిధ భాషలలో స్పెషల్ ప్రీమియర్ షో లను వేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. వరల్డ్ వైడ్ గా అత్యధిక ప్రీమియర్ షోలు ఈ సినిమాకి పడబోతున్నాయని తెలుస్తోంది. కచ్చితంగా ఈ చిత్రం మొదటిరోజు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే యూఎస్ లో 'పుష్ప 2' ప్రీమియర్ షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా పుష్పరాజ్ క్రేజ్ గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ అప్పుడే మొదలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రీమియర్ షోలకు సంబంధించి 3400 టికెట్స్ అమ్ముడైనట్లు సమాచారం. బుకింగ్స్ ఓపెన్ చేసిన రెండు రోజుల్లోనే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోవడం అంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టి 'పుష్ప 2' పైన ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
త్వరలో ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా మొదలు కాబోతున్నాయని తెలుస్తోంది. ఇంకా ఐటెం సాంగ్ చిత్రీకరణ పెండింగ్ ఉందంట. ఇప్పటికే ఆ పాట కోసం శ్రీలీలను కన్ఫామ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సాంగ్ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇది కంప్లీట్ అయిన వెంటనే నవంబర్ మూడో వారం నుంచి పూర్తిగా ప్రమోషన్స్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ నార్త్ ఇండియాలో ప్రధాన పట్టణాలలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
దాంతోపాటు యూఎస్ లో ప్రీమియర్ షోలకు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షో కలెక్షన్స్ తో 'కల్కి 2898ఏడీ' రికార్డును బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే యూఎస్ లో ఓవరాల్ కలెక్షన్స్ పరంగా కూడా మొదటి రెండు స్థానాల్లో ఉన్న 'బాహుబలి 2', 'కల్కి' లలో ఒకటి 'పుష్ప 2' బ్రేక్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి సోలోగా 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలుస్తారు.
నార్త్ ఇండియాలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డు షారుఖ్ ఖాన్ 'జవాన్' పేరు మీద ఉంది. దీన్ని కూడా 'పుష్ప 2' బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అల్లు అర్జున్ స్టామినాకి ఇదో పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. దీంట్లో అతను విన్ అయితే పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని మార్కెట్ ని సొంతం చేసుకొని అవకాశం ఉంది.