Begin typing your search above and press return to search.

'పుష్ప 2' ర్యాంపేజ్‌.. 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్!

ఈ క్రమంలో ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ బుక్‌ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడైన చిత్రంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

By:  Tupaki Desk   |   4 Dec 2024 2:34 AM GMT
పుష్ప 2 ర్యాంపేజ్‌.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్!
X

అస్సలు తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2: ది రూల్‌' సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. డిసెంబర్‌ 4 బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అయితే విడుదలకు ముందు ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన 'పుష్ప 2' చిత్రం.. ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈసారి ఏకంగా 'బాహుబలి 2' పేరిట ఉన్న రికార్డునే బ్రేక్ చేసేసింది.

'పుష్ప 2: ది రూల్‌' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ బుక్‌ మై షోలో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడైన చిత్రంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో 'బాహుబలి-2', 'కల్కి 2898 ఏడీ', కేజీఎఫ్-2' రికార్డులను 'పుష్ప 2' చెరిపేసినట్లయిందని సినీవర్గాలు పేర్కొన్నాయి. కేవలం బుక్‌ మై షోలోనే 1 మిలియన్‌ టికెట్స్‌ అమ్ముడవ్వగా.. పేటీఎం లాంటి ఇతర యాప్స్ లోనూ శరవేగంగా టికెట్స్ బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే బుక్‌ మై షోలో గంటకు అత్యధిక టిక్కెట్ల విక్రయాలు జరిగిన సినిమాగా 'పుష్ప 2: ది రూల్‌' రికార్డులకెక్కింది. ప్రతీ గంటకు 100K+ టికెట్లు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకముందు 'కల్కి' (97.7K), 'జవాన్' (86K), 'లియో' (83K), 'యానిమల్' (80K) సినిమాలు ఈ జాబితాలో ఉండగా.. ఇప్పుడు 'పుష్ప' సీక్వెల్ వాటిని క్రాస్ చేసింది. అలానే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టిన ఇండియన్ సినిమాగా 'పుష్ప 2: ది రూల్‌' రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

రిలీజ్ కు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న 'పుష్ప-2' సినిమా.. రిలీజ్ తర్వాత దగ్గర మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లతో లెక్క ప్రారంభం అవుతుందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఎస్.ఎస్ రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్లడం కాదు, రాజమౌళి రికార్డులను సైతం బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి 'పుష్ప 2: ది రూల్‌' సినిమా రూలింగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' సినిమా తెరకెక్కింది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో, 6 భాషల్లో, 12 వేలకుపైగా స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. 3డీ వెర్షన్‌ మినహా 2డీ, 4DX, ఐమాక్స్ వంటి ఆరు ఫార్మాట్లలో ఈ మూవీ విడుదల కాబోతోంది.