Begin typing your search above and press return to search.

హిందీలో పుష్ప 2 హవా ఎలా ఉందంటే?

మొత్తానికి బాలీవుడ్ లో ఈ రెండు సినిమాల మధ్యలో థియేటర్స్ కోసం జరిగే ఫైట్ ని 'పుష్ప 2' క్రేజ్ 'భూల్ భూలయ్యా 3' కి అనుకూలంగా మార్చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   30 Oct 2024 4:14 AM GMT
హిందీలో పుష్ప 2 హవా ఎలా ఉందంటే?
X

బాలీవుడ్ ఇండస్ట్రీ లో 'పుష్ప 2' పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోయే ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పైన దేశ వ్యాప్తంగా హైఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. 1000 కోట్ల వరకు థీయాట్రికల్, నాన్ థీయాత్రికల్ బిజినెస్ జరిగింది. హిందీలో ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్టిబ్యూటర్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ఆయన నుంచి మూవీ వస్తుందంటేనే 'పుష్ప 2' పట్ల నార్త్ లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ పవర్, 'పుష్ప 2' క్రేజ్ ని ఇప్పుడు బాలీవుడ్ లో దీపావళి కానుకగా రిలీజ్ అయ్యే రెండు సినిమాల థియేటర్స్ పంపకాలకి శాసిస్తుంది. రోహిత్ శెట్టి సూపర్ హిట్ ఫ్రాంచైజ్ సింగం సిరీస్ నుంచి 'సింగం అగైన్' నవంబర్ 1న రిలీజ్ అవుతోంది. అలాగే కార్తీక్ ఆర్యన్ హీరోగా సూపర్ హిట్ హర్రర్ సిరీస్ లో భాగంగా 'భూల్ భూలయ్యా 3' వస్తోంది. అయితే సింగం అగైన్ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో థియేటర్స్ షేరింగ్ ఎక్కువ కావాలని ఆ మూవీ మేకర్స్ డిమాండ్ చేస్తున్నారు.

సినిమాపై అంచనాలు హెవీగా ఉండటంతో ఎగ్జిబిటర్లు 'సింగం అగైన్' పట్ల ఆసక్తి చూపించారు. అయితే 'భూల్ భూలయ్యా 3' ని రిలీజ్ చేస్తోన్న అనిల్ తడాని ఎగ్జిబిటర్లకి బిగ్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమాని తమ థియేటర్స్ లో ప్రదర్శిస్తే 'పుష్ప 2' కి సంబంధించి 30 అడుగుల కటౌట్ ని ఉచితంగా పెడతానని చెప్పారు. దీంతో 'భూల్ భూలయ్యా 3' పైన ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ పంపకాలలో 50:50 షేరింగ్ కావాలని అనిల్ తడాని పట్టుపబడుతున్నారు.

దానికి 'సింగం అగైన్' మేకర్స్ కాస్తా బెట్టు చేయడంతో పుష్ప 2 క్రేజ్ ని అనిల్ తడాని ఉపయోగించుకుంటున్నారు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్లు సింగం అగైన్ కాకుండా 'భూల్ భూలయ్యా 3' ని థియేటర్స్ లో ప్రదర్శించాలని అనుకుంటున్నారు. మరో వైపు 'భూల్ భూలయ్యా 3' ని నిర్మించిన టి-సిరీస్ 'సింగం' మొదటి పార్ట్ ని నిర్మించింది. అందులో థీమ్ మ్యూజిక్ ని 'సింగం అగైన్' కి ఉపయోగించడంతో టి-సిరీస్ కాపీ రైట్ వైలేషన్ యాక్ట్ ని ప్రయోగించినట్లు తెలుస్తోంది..

మొత్తానికి బాలీవుడ్ లో ఈ రెండు సినిమాల మధ్యలో థియేటర్స్ కోసం జరిగే ఫైట్ ని 'పుష్ప 2' క్రేజ్ 'భూల్ భూలయ్యా 3' కి అనుకూలంగా మార్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రెండు సినిమాలకి సంబందించిన డిస్టిబ్యూటర్స్ కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారంట.