Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్‌: హిందీలో చావా దూకుడు.. కానీ పుష్ప 2 రేంజ్ వేరు!

బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాల్లో తాజాగా చావా పేరు ట్రెండింగ్‌లోకి ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 March 2025 3:14 PM IST
బాక్సాఫీస్‌: హిందీలో చావా దూకుడు.. కానీ పుష్ప 2 రేంజ్ వేరు!
X

బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాల్లో తాజాగా చావా పేరు ట్రెండింగ్‌లోకి ఉన్న విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మొదటి రెండు వారాల్లో భారీ కలెక్షన్లు రాబట్టగా, మూడో వారంలోనూ అదే దూకుడును కొనసాగిస్తూ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ లెక్క 600 కోట్లను దాటింది. ఇక 85 కోట్ల రూపాయల షేర్‌తో మూడో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది.

కానీ ఈ లిస్ట్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచిన సినిమా మాత్రం పుష్ప 2. 2024 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం మూడో వారం అద్భుతమైన వసూళ్లు రాబట్టి 103 కోట్ల రూపాయల భారీ షేర్‌ను హిందీలో నమోదు చేసింది. పుష్ప 2 గ్లోబల్ గా 1800 కోట్ల గ్రాస్ మార్కును దాటి ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలిచిన ఈ చిత్రం, మొదటి వారంలోనే 600 కోట్ల మార్కును దాటి బాలీవుడ్ స్టార్స్‌ను కూడా షాక్‌కు గురి చేసింది.

ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. మూడో వారంలో కూడా సినిమా బీభత్సమైన కలెక్షన్లు నమోదు చేయగలగడం నిజంగా అరుదైన ఘటన. గతంలో బాహుబలి 2, గదర్ 2 వంటి సినిమాలు మాత్రమే ఈ రేంజ్‌లో నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో కొత్తగా చేరిన సినిమా చావా. ఈ సినిమా మొదటి వారం నుంచే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది.

చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో విక్కీ కౌశల్ సినిమా ఈ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేయడం ఆశ్చర్యంగా మారింది. మూడో వారంలోనూ ఈ సినిమా మంచి స్క్రీన్స్ రిటైన్ చేసుకోవడంతో మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

పుష్ప 2 తర్వాత ఈ లిస్ట్‌లో నిలిచిన మూడో సినిమా స్త్రీ 2. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీ చిత్రం తన రన్‌ను కొనసాగిస్తూ 70 కోట్ల షేర్ సాధించింది. దీని తర్వాత అదే లెవెల్లో నిలిచిన మరో సినిమా బాహుబలి 2. 2017లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌లో అత్యధికంగా వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది. 70 కోట్ల రూపాయల షేర్‌ను మూడో వారంలో నమోదు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇక గదర్ 2 63 కోట్ల రూపాయల షేర్‌తో ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచింది.

హిందీలో మూడో వారం టాప్ 5 కలెక్షన్లు:

1. పుష్ప 2 - ₹103cr

2. ఛావా - ₹85cr

3. స్త్రీ 2 - ₹70cr

4. బాహుబలి 2 - ₹70cr

5. గదర్ 2 - ₹63cr