Begin typing your search above and press return to search.

పుష్ప 2 హిందీ: ఫస్ట్ పార్ట్ ఓపెనింగ్స్ తో పోలిస్తే ఎంత తేడా?

పుష్ప: ది రైజ్ ప్రారంభ రోజున హిందీలో సాధించిన వసూళ్లను ఇప్పుడు పుష్ప: ది రూల్ ఉహించని మెరిట్‌తో షాక్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 6:01 AM GMT
పుష్ప 2 హిందీ: ఫస్ట్ పార్ట్ ఓపెనింగ్స్ తో పోలిస్తే ఎంత తేడా?
X

పుష్ప ఫ్రాంచైజీ బ్రాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 1 టైమ్ లో పెద్దగా అంచనాలు లేకుండానే మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈసారి పుష్ప 2 సినిమా భారీ హైప్‌తో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ రెండు భాగాల హిందీ బాక్సాఫీస్ ఓపెనింగ్‌లలో తేడా చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగకమానదు. పుష్ప: ది రైజ్ ప్రారంభ రోజున హిందీలో సాధించిన వసూళ్లను ఇప్పుడు పుష్ప: ది రూల్ ఉహించని మెరిట్‌తో షాక్ ఇచ్చింది.

పుష్ప: ది రైజ్ విడుదలకు ముందు హిందీ మార్కెట్‌లో అల్లు అర్జున్ పేరు కేవలం యూట్యూబ్ పరంగా క్రేజ్ అందుకుంది. డబ్బింగ్ సినిమాలతో అక్కడ భారీ వ్యూవ్స్ అందుకున్నారు. అయితే, పుష్ప 1 సినిమా విడుదల టైమ్ లో పెద్దగా ప్రమోషన్ కూడా చేసింది లేదు. కానీ సినిమా ఊహించని విధంగా హైప్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ నటన, పాత్రకి అందరూ ఫిదా అయ్యారు. దీంతో పుష్ప: ది రైజ్ మొదటి రోజు హిందీ వెర్షన్‌లో రూ. 3.33 కోట్ల వసూళ్లు మాత్రమే నమోదు చేసింది.

ఆ తరువాత సినిమా కంటెంట్ కారణంగా నెమ్మదిగా పెరుగుతూ భారీగా వసూళ్లు సాధించింది. అయితే ఇది ఎవరూ ఊహించని సక్సెస్ స్టోరీగా మారింది. ఇక పుష్ప: ది రూల్ మాత్రం మొదటి నుంచే హిందీ ప్రేక్షకులలో భారీ అంచనాలతో విడుదలైంది. పుష్ప 1 సక్సెస్ తర్వాత హిందీ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ పేరు మరింత బలపడింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 మొదటి రోజు హిందీ వెర్షన్‌లోనే రూ. 72 కోట్ల వసూళ్లను సాధించింది.

ఇది కేవలం అల్లు అర్జున్ క్రేజ్ మాత్రమే కాకుండా, పుష్ప బ్రాండ్ ఎంత బలంగా నిలిచిందో స్పష్టంగా చూపిస్తుంది. పుష్ప 1 హిందీ మార్కెట్‌లో ఓపెనింగ్ డే కలెక్షన్ రూ. 3.33 కోట్లు అయితే, పుష్ప 2 రూ. 72 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ రెండు భాగాల మధ్య ఓపెనింగ్ కలెక్షన్స్‌లో తేడా ఏకంగా 21 రెట్లకు పైగా ఉంది. ఇది ఒక తెలుగువారి సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద సాధించిన బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు.

పుష్ప 1 విడుదల తర్వాత అల్లు అర్జున్ హిందీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. మాస్ అవతారంలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కలిపి నార్త్ ఇండియన్ మార్కెట్‌ లో స్టార్‌గా మార్చాయి. పుష్ప 2 హిందీలో భారీగా హైప్‌ను పెంచి, మొదటి రోజు నుంచే అన్ని చోట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు పుష్ప 2 ఓపెనింగ్ కలెక్షన్స్ చూసినప్పుడు, హిందీ మార్కెట్‌లో తెలుగు చిత్రాల స్థాయి ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. హిందీ ప్రేక్షకులకు సరైన కంటెంట్ అందించగలిగితే, వసూళ్ల పరంగా ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో పుష్ప ఫ్రాంచైజీ ఒక ఉదాహరణగా నిలిచింది.

.