హిందీలో పుష్ప 2 కలెక్షన్స్… 20 రోజుల లెక్కలివే..
ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా ‘స్త్రీ 2’ మూవీని రెండు వారాల్లోనే ఈ చిత్రం అధికమించింది.
By: Tupaki Desk | 25 Dec 2024 12:00 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ దేశ వ్యాప్తంగా 1700 కోట్లు కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమాకి లాంగ్ రన్ లో ఎంత ప్రాఫిట్ వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో 315 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటిన ఈ చిత్రం హిందీలో దానికి రెట్టింపు వసూళ్లు అందుకుంది. ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో ఈ చిత్రానికి 715.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
అంటే ఈ ఏడాదిలోనే కాకుండా హిందీలో అత్యధిక వసూళ్లు అందుకొని ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా ‘స్త్రీ 2’ మూవీని రెండు వారాల్లోనే ఈ చిత్రం అధికమించింది. అలాగే హిందీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు చిత్రంగా మరో అరుదైన ఫీట్ కూడా ఈ మూవీ సాధించింది. ఇక మూడో వారంలో కూడా హిందీ రాష్ట్రాలలో ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ రావడం విశేషం.
16వ రోజైన శుక్రవారం 12.50 కోట్లు వసూళ్లు చేసిన ఈ మూవీ 17వ రోజైన శనివారం ఏకంగా 20.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 18వ రోజైన ఆదివారం 27 కోట్లు వసూళ్లు చేసింది. 19వ రోజు 11.75 కోట్లు, 12వ రోజు 11.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. దీంతో ఓవరాల్ గా హిందీలో 715.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకుంది.
మూడో వారంలో కలెక్షన్స్ నిలకడగా సాగుతూ ఉండటంతో లాంగ్ రన్ లో ‘పుష్ప 2’ మూవీ 750-800 కోట్ల మధ్యలో వసూళ్లు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. ఇక ఈ మూవీతో కలిపి తెలుగులో నాలుగు చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ కల్కి 2898ఏడీ’ వరుస స్థానాలలో ఉన్నాయి.
డే 1 - 72CR
డే 2 - 59CR
డే 3 - 74CR
డే 4 - 86CR
డే 5 - 48CR
డే 6 - 36CR
డే 7 - 31.50CR
డే - 27CR
డే - 27.50CR
డే 10 - 46.50CR
డే 11 - 54CR
డే 12 - 20.50CR
డే 13 - 19.50CR
డే 14 - 17.00CR
డే 15 - 14.00CR
డే 16 - 12.50CR
డే 17 - 20.50CR
డే 18 - 27CR
డే 19 - 11.75CR
డే 20 - 11.50CR