పుష్ప 2 రేట్లు తగ్గాయోచ్.. ఇక కలెక్షన్స్ కుమ్ముడేనా..?
పెంచిన టికెట్ రేట్ల వల్ల మధ్య తరగతి మనుషులు సినిమాకు వెళ్లడం కష్టం అన్నట్టుగా ఉండేది. కానీ రేట్లు తగ్గించి వారు కూడా సినిమా చూసేలా ప్రోత్సహిస్తున్నారు.
By: Tupaki Desk | 9 Dec 2024 6:09 AM GMTపుష్ప 2 పై ఉన్న బజ్ ని క్యాష్ చేసుకోవాలనుకునే ప్రయత్నంలో మైత్రి నిర్మాతలు సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచారు. ఐతే ముఖ్యంగా పుష్ప 2 టికెట్ రేట్ల హైక్ మీద రిలీజ్ ముందు ఆడియన్స్ నుంచి కాస్త అసంతృప్తి వచ్చింది. కానీ సినిమాకు వచ్చిన ఆ టాక్ టికెట్ రేట్ ఇష్యూని సై చేసేసింది. పుష్ప 2 అల్లు అర్జున్ నట విశ్వరూపం వారు పెట్టిన రేటుకి పక్కా పైసా వసూల్ ఎక్స్ పీరియన్స్ అనిపించేసింది. పుష్ప 2 సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచారు. సింగిల్ స్క్రీన్స్ లో 300, మల్టీప్లెక్స్ 800, ప్రీమియర్ షోకి 1000 వసూలు చేశారు.
ఐతే ఈ టికెట్ రేట్ల వల్ల సినిమా వీకెండ్ వరకు సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. ఐతే సినిమాకు ఎలాగు హిట్ టాక్ వచ్చింది కాబట్టి టికెట్ రేట్లను తగ్గించేశారు నిర్మాతలు. సోమవారం నుంచి తగ్గించిన రేట్లతోనే సినిమా నడిపించనున్నారు. కామన్ గా ఎలా అయితే టికెట్ రేట్లు ఉంటాయో ఆ రేట్లతోనే సినిమా నడిపిస్తారు. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ లో 200, మల్టీప్లెక్స్ లో 300 నుంచి 400 మధ్యలో టికెట్ రేట్లు ఉన్నాయి.
పెంచిన టికెట్ రేట్ల వల్ల మధ్య తరగతి మనుషులు సినిమాకు వెళ్లడం కష్టం అన్నట్టుగా ఉండేది. కానీ రేట్లు తగ్గించి వారు కూడా సినిమా చూసేలా ప్రోత్సహిస్తున్నారు. ఎలాగు సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి పుష్ప 2 తెలుగు కలెక్షన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. పుష్ప 2 సినిమా ఫాస్టెస్ట్ 500 కోట్ల సినిమా కాగా నిన్నటితో అది 600 కోట్లు దాటేసింది. ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమాగా కూడా పుష్ప 2 సరికొత్త రికార్డ్ సృష్టించేలా ఉంది.
ఒక రకంగా ఈ సినిమా సక్సెస్ మరికొన్ని పాన్ ఇండియా సినిమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ యాటిట్యూడ్ కి కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. సినిమా మొత్తం అదే ఒకే రకమైన నటనతో ఆకట్టుకున్నాడు. మరి పుష్ప 2 ఫైనల్ టార్గెట్ ఎంత రీచ్ అవుతుంది అన్నది చూడాలి. పుష్ప 2 సినిమా సృష్టిస్తున్న రికార్డులు తెలుగు స్టార్స్ కి మాత్రమే కాదు బాలీవుడ్ హీరోల మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.