నార్త్‌లో 1000 కోట్లు.. షారూఖ్ తర్వాత బన్నీ ఒక్కడే!
ఈ సినిమాల సరసన ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' చేరింది. అంటే హిందీలో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను అందించిన ఇద్దరు భారతీయ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్ - అల్లు అర్జున్ మాత్రమే.
By: Tupaki Desk | 3 Jan 2025 3:58 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'పుష్ప -2' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1800 కోట్ల రూపాయలను వసూలు చేసింది. నార్త్ లో ఇప్పటికీ వసూళ్ల హవా సాగిస్తూనే ఉంది. ఇప్పుడు బాహుబలి 2: ది కన్‌క్లూజన్ , దంగల్ తర్వాత ఆల్ టైమ్ అతిపెద్ద భారతీయ గ్రాసర్లలో ఆల్ టైమ్ మూడవ అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది.
అదే సమయంలో పుష్ప 2 మరో అరుదైన రికార్డును కైవశం చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' ఒకే భాషలో అంటే హిందీలో రూ. 1000 కోట్ల బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన ఏకైక దక్షిణ భారత చిత్రంగా నిలిచింది. పుష్ప 2 విధ్వంసంతో ఒకే (హిందీ) భాషలో రూ. 1000 కోట్లు వసూలు చేసినవి 3 సినిమాలు మాత్రమే. ఇప్పుడు హిందీలో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను సాధించిన మూడవ భారతీయ చిత్రం పుష్ప 2. పుష్ప 2 కంటే ముందు హిందీలో రూ. 1000 కోట్లు కొట్టిన రెండు చిత్రాలు షారుఖ్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్', మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ - 'జవాన్' మాత్రమే.
పఠాన్, జవాన్ రెండూ ఒకే భాష అంటే హిందీ నుండి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లను తాకిన ఏకైక బాలీవుడ్ చిత్రాలు. ఈ సినిమాల సరసన ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' చేరింది. అంటే హిందీలో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలను అందించిన ఇద్దరు భారతీయ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్ - అల్లు అర్జున్ మాత్రమే.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'పఠాన్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1050 కోట్లు వసూలు చేసింది. తొమ్మిది నెలల తర్వాత అదే ఏడాదిలో SRK - అట్లీ సినిమా 'జవాన్' ప్రపంచవ్యాప్తంగా రూ.1150 కోట్లు వసూలు చేసింది.
జవాన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరవ అతిపెద్ద భారతీయ వసూళ్ల సినిమాగా రికార్డుల్లో ఉంది. పఠాన్ ఏడవ స్థానంలో ఉంది. బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ 2 లాంటి చిత్రాలు 1000 కోట్లు మించి వసూలు చేసినా కానీ కేవలం హిందీ భాష నుంచి 1000 కోట్లు సాధించిన సినిమాల జాబితాలో లేవు.