Begin typing your search above and press return to search.

పుష్ప 2…. శనివారం కుమ్మేసింది

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో 10వ రోజు 100 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకున్న మొట్టమొదటి చిత్రంగా 'పుష్ప 2' నిలిచింది.

By:  Tupaki Desk   |   15 Dec 2024 9:24 AM GMT
పుష్ప 2…. శనివారం కుమ్మేసింది
X

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన 'పుష్ప 2' ఫీవర్ కనిపిస్తోంది. గత 10 రోజుల నుంచి థియేటర్స్ లో పుష్పరాజ్ హంగామాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదిరిపోయే కలెక్షన్స్ తో ఈ సినిమాకి బ్యాక్ టూ బ్యాక్ రికార్డులు ఇస్తూన్నారు. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ మూవీ రెండో వారంలోకి అడుగు పెట్టింది. శనివారం ఈ సినిమా వసూళ్లతో మరో అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది.

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో 10వ రోజు 100 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకున్న మొట్టమొదటి చిత్రంగా 'పుష్ప 2' నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శనివారం ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని పోస్టర్ తో తెలియజేశారు. మరో వైపు ఈ చిత్రం ఇంకో అరుదైన రికార్డ్ ని కూడా అందుకుంది. హిందీలో ఏకంగా 500 కోట్ల కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది.

తద్వారా హిందీలో 'బాహుబలి 2' తర్వాత 500 కోట్ల క్లబ్ లో చేరిన రెండో తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. అలాగే హిందీలో అత్యంత వేగంగా 500 కోట్ల కలెక్షన్స్ అందుకున్న సినిమాగా మరో రికార్డ్ ని ఈ చిత్రం క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఆదివారం కూడా ఈ మూవీ వసూళ్లు 100 కోట్లకి పైనే వస్తాయని అనుకుంటున్నారు. అదే జరిగితే హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన సౌత్ సినిమాగా 'బాహుబలి 2' పేరు మీద ఉన్న రికార్డ్ ని 'పుష్ప 2' లాగేసుకుంటుంది.

ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ 12 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లని 10 రోజుల్లోనే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే 'పుష్ప 2' ప్రభంజనాన్ని మరో వారం రోజుల వరకు ఎవ్వరు ఆపలేకపోవచ్చని అనుకుంటున్నారు. తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాకి ఎక్కువ ఆదరణ వస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ పై ఈ ఏడాది అత్యధిక వసూళ్లు అందుకున్న మొదటి, రెండు సినిమాలు టాలీవుడ్ నుంచి వచ్చినవే కావడం విశేషం.

మరోసారి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సినిమాల కలెక్షన్స్ పరంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్ వన్ గా తన స్థానాన్ని నిలుపుకుంది. వచ్చే ఏడాది కూడా అరడజనుకి పైగా పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ నుంచి రాబోతున్నాయి. 'పుష్ప 2' ఇచ్చే జోష్ తో ఇంకెన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రికార్డుల మోత మోగిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.