Begin typing your search above and press return to search.

మలయాళంలో పుష్ప 2.. క్లిక్కయ్యిందా లేదా?

సినిమాకి బాగుందనే టాక్ వచ్చిన కూడా అక్కడి ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో లేకపోవడం వలన ప్రతికూల ప్రభావం కనిపిస్తుందని అనుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 3:15 AM GMT
మలయాళంలో పుష్ప 2.. క్లిక్కయ్యిందా లేదా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మలయాళీ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది. అతని సినిమాలు చాలా వరకు మలయాళంలో డబ్బింగ్ అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా మలయాళంలో డబ్బింగ్ అయ్యి అక్కడి నిర్మాతలకి కాసుల వర్షం కురిపించాయి. అందుకే అల్లు అర్జున్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయ్యింది. అల్లు అర్జున్ ఎప్పుడు కేరళ వెళ్లిన కూడా ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు.

అయితే తెలుగు, తమిళ్ భాషల తరహాలో హీరో వర్షిప్ అక్కడ ఉండదు. వారు సినిమాలు చూసే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా స్టోరీ నేరేషన్ ఎలా ఉందనేది చూస్తారు. అలాగే రియలిస్టిక్ గా కథ, కథనంతో పాటు యాక్షన్ ఘట్టాలు ఉండాలని కోరుకుంటారు. అయితే బన్నీ గత సినిమాలు చాలా వరకు మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీస్ గానే వచ్చిన కూడా డబ్బింగ్ వెర్షన్ లో ఎప్పుడో రిలీజ్ అవుతూ ఉండేవి. అది కూడా అక్కడి నిర్మాతలు తక్కువ మొత్తానికి ఈ సినిమాల డబ్బింగ్ రైట్స్ పొందేవారు.

అయితే 'పుష్ప 2' సినిమాని అన్ని భాషలలో ఒకేసారి రిలీజ్ చేశారు. డబ్బింగ్ రైట్స్ కూడా భారీ ధరకి అమ్మారు. అల్లు అర్జున్ ఇమేజ్ కారణంగా కేరళలో ఈ సినిమాకి మొదటి రోజు 6 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇది చాలా పెద్ద మొత్తం అని చూపొచ్చు. అయితే రెండో రోజుకే కేరళలో థియేటర్స్ ఆక్యుపెన్సీ 50 శాతం డ్రాప్ అయ్యిందని తెలుస్తోంది. కలెక్షన్స్ కూడా గణనీయంగా తగ్గిపోయాయంట. సినిమాకి బాగుందనే టాక్ వచ్చిన కూడా అక్కడి ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో లేకపోవడం వలన ప్రతికూల ప్రభావం కనిపిస్తుందని అనుకుంటున్నారు.

అనూహ్యంగా తమిళనాడులో 'పుష్ప 2'కి మంచి ఆదరణ లభిస్తోంది. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ స్థాయిలో తమిళనాట రెస్పాన్స్ అందుకుంటున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇక నార్త్ ఇండియాలో అయితే కలెక్షన్స్ పరంగా 'పుష్ప 2' ఊచకోత కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ 200 కోట్ల క్లబ్ లో మూవీ చేరిపోయింది. 'పుష్ప 1'కి నార్త్ లో ఓవరాల్ గా 100+ కలెక్షన్స్ వస్తే 'పుష్ప 2' కేవలం మూడు రోజుల్లోనే డబుల్ హండ్రెడ్ కలెక్షన్స్ దాటడం విశేషం.

దీనిని బట్టి నార్త్ ఆడియన్స్ ఈ సినిమాని ఎంత గొప్పగా ఆధరిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఓవరాల్ గా 600+ కోట్ల కలెక్షన్స్ ని 'పుష్ప 2' మూవీ అందుకుంది. శనివారం కూడా 150 కోట్లు కలెక్షన్స్ దాటి వచ్చి ఉంటాయని అనుకుంటున్నారు. ఇక ఆదివారం కూడా 150-200 కోట్ల మధ్యలో కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వీకెండ్ పూర్తయ్యేసరికి 'పుష్ప 2' కలెక్షన్స్ 800-900 కోట్ల మధ్యలో ఉంటాయని అనుకుంటున్నారు.