Begin typing your search above and press return to search.

పుష్ప 2: నార్త్ అమెరికాలో కిర్రాక్ ప్రీ సేల్స్

తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ప్రీ సేల్స్ ద్వారా $2.088 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 10:27 AM GMT
పుష్ప 2: నార్త్ అమెరికాలో కిర్రాక్ ప్రీ సేల్స్
X

అందరి దృష్టి పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షోలపైనే ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న నార్త్ అమెరికాలో గ్రాండ్ ప్రీమియర్ షోలతో ప్రారంభం కానుంది. అయితే ప్రీమియర్ షోలకుగాను ఇప్పటికే రికార్డు స్థాయి ప్రీ సేల్స్ జరగడం విశేషం. తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ప్రీ సేల్స్ ద్వారా $2.088 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

ఈ సినిమా ప్రీమియర్ షోల కోసం యూఎస్‌లో 3705 షోలను 1010 లొకేషన్లలో ప్లాన్ చేశారు. ఇప్పటివరకు 68,270 టికెట్లు సేల్ అయ్యాయి, దీని ద్వారా $1,932,783 డాలర్లు వసూలు అయ్యాయి. కెనడాలో 95 షోలను 24 లొకేషన్లలో ప్లాన్ చేసి, 5946 టికెట్లు విక్రయించగా, $155,596 డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ఈ నెంబర్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూఎస్‌లోని థియేటర్ చైన్స్, కెనడాలోని సినీ ప్లెక్స్ చైన్లలో మరిన్ని షోలు వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కంటెంట్ డెలివరీ పూర్తి కాగానే ఈ షోలు లైవ్ అవుతాయని తెలుస్తోంది. దీనితో ప్రీమియర్ షోలకు ఇంకా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రిజర్వేషన్లు చేస్తారని భావిస్తున్నారు. ‘పుష్ప 2’ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మాత్రమే కాదు, పాన్ గ్లోబల్ సెన్సేషన్‌గా నిలుస్తోంది. సుకుమార్ దర్శకత్వం, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, అల్లు అర్జున్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైప్ క్రియేట్ చేయడంతో ఇది కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ భారీ క్రేజ్ సాధిస్తోంది.

సినిమా రిలీజ్‌కి ఇంకా మూడు రోజులు సమయం ఉండగా, ప్రీ సేల్స్ ఈ రేంజ్‌లో ఉండడం సినిమా విజయం ఎలా ఉండబోతోందో సూచిస్తోంది. ప్రీమియర్ షోలకే ఇంత క్రేజ్ ఉంటే, మిగతా రోజుల్లో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. ఈ ప్రీ సేల్స్ సంఖ్యలను గమనిస్తే, ‘పుష్ప 2’ ఓవర్సీస్ మార్కెట్‌లో కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం. మేకర్స్ కూడా ఈ అంచనాలను మరింత పెంచుతూ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందరి కళ్లూ ఇప్పుడు డిసెంబర్ 4న ప్రీమియర్ షోలపై నిలిచాయి.

ఇక మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 250 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్ళను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాక్ బాగుంటే లెక్క 300 కోట్లకు కూడా చేరవచ్చు అని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో కూడా హై రేంజ్ లో.కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. టిక్కెట్ రేట్లు పెరిగినా కూడా ఆడియెన్స్ అస్సలు తగ్గడం లేదు. మొదటి రోజు మొదటి షో చూడాలని ఫిక్స్ అయ్యారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.