Begin typing your search above and press return to search.

పుష్ప 2 నార్త్ ఇండియా.. అందరి ఫోకస్ ఆ నెంబర్ పైనే..

ఇదిలా ఉంటే 'పుష్ప 2' ఫస్ట్ డే కలెక్షన్స్ పై నార్త్ ఇండియాలో అప్పుడే బెట్టింగ్స్, పోల్స్ మొదలవడం విశేషం.

By:  Tupaki Desk   |   19 Nov 2024 5:18 AM GMT
పుష్ప 2 నార్త్ ఇండియా.. అందరి ఫోకస్ ఆ నెంబర్ పైనే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' కోసం దేశ వ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తూ పబ్లిక్ లో పంపించే పనిలో ఉన్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి తెలుగు, హిందీ భాషలలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే 'పుష్ప 2' ట్రైలర్ కి ప్రేక్షకుల విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఈ మూవీ కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 'పుష్ప' తో బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ లభించింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బన్నీని బీహార్ ప్రజలు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. 'పుష్ప 2' కోసం అక్కడి ప్రేక్షకులు ఎంత ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారనేది ఈ ఈవెంట్ తోనే స్పష్టం అయ్యింది. ఇంకా మరో ఆరు మెగా ప్రమోషనల్ ఈవెంట్స్ ఆరు పట్టణాలలో జరగబోతున్నాయి. వాటికి కూడా అద్భుతమైన ఆదరణ వస్తుందని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే 'పుష్ప 2' ఫస్ట్ డే కలెక్షన్స్ పై నార్త్ ఇండియాలో అప్పుడే బెట్టింగ్స్, పోల్స్ మొదలవడం విశేషం. దీనిని బట్టి అక్కడ ఈ చిత్రానికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అంచనా వేయవచ్చు. ఈ మూవీ మొదటి రోజు హిందీ బెల్ట్ లో 60 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు. అయితే ఇది బేసిక్ నెంబర్ అని, ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన 70 నుంచి 80 కోట్ల మధ్యలో నెట్ వసూళ్లు చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

ఒక వేళ ఈ మూవీ 70 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తే మాత్రం కచ్చితంగా షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ అయిపోతుంది. ఆ మూవీ మొదటి రోజు 65 కోట్లు కలెక్ట్ చేస్తుంది. 'పుష్ప 2' ఆ నెంబర్ ని దాటితే మాత్రం సంచలనమని చెప్పాలి. అదే జరిగితే హిందీలో నెంబర్ వన్ హీరోగా ఉన్న షారుఖ్ ఖాన్ సినిమా కంటే ఎక్కువ క్రేజ్ 'పుష్ప 2' కి ఉందని కచ్చితంగా ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. అలాగే అల్లు అర్జున్ ఇమేజ్, మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోతుంది.

పుష్ప రాజ్ క్యారెక్టర్ కి నార్త్ లో యూత్ డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ బన్నీ కంటే పుష్ప రాజ్ కి కనెక్ట్ అయ్యారు. అందుకే పుష్ప 2 కోసం ఇంతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కమర్షియల్ సినిమాకి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే బన్నీ ప్రయత్నాన్ని 'పుష్ప 2' కచ్చితంగా నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.