పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్… వెన్యూ ఎక్కడంటే?
దీంతో వెన్యూని మల్లారెడ్డి యూనివర్సిటీకి మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. గ్రాండ్ గా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని సమాచారం.
By: Tupaki Desk | 30 Nov 2024 9:35 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ చిత్రం ఉంది. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎంత హైప్ ఉందో అంతకు మించి నార్త్ ఇండియాలో ఈ సినిమాపైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ థియేటర్స్ లో ఎప్పుడు వస్తుందా అని పుష్పరాజ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై సిటీస్ లలో పర్యటించాడు. అక్కడ పబ్లిక్ అండ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూలకి పరిమితం కాకుండా నేరుగా పబ్లిక్ ఈవెంట్స్ ద్వారా ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేశాడు. ఈ ఈవెంట్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లో మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
నిజానికి పోలీస్ గ్రౌండ్స్ లో చేయాలని అనుకున్నారు. అయితే అక్కడ ట్రాఫిక్ సమస్యల కారణంగా పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో వెన్యూని మల్లారెడ్డి యూనివర్సిటీకి మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. గ్రాండ్ గా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని సమాచారం. ఈ ఈవెంట్ కి సినిమా కోసం పనిచేసిన నటీనటులతో పాటు టెక్నీకల్ టీమ్ సభ్యులు అందరూ హాజరు కాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.
ఈవెంట్ కి సంబందించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ ఈవెంట్ జరగబోతోంది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎవరిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారనేది క్లారిటీ లేదు. ఐకాన్ స్టార్ మానియాతోనే విశేషంగా అభిమానులు ఈవెంట్ కి తరలి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ‘పుష్ప 2’ మూవీ టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది.
అలాగే డిసెంబర్ 4న స్పెషల్ బెన్ ఫిట్ షోలకి కూడా పర్మిషన్ ఇచ్చింది. టికెట్ ధరలు కూడా భారీగానే పెంచారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుతో ‘పుష్ప 2’కి భారీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఏపీలో కూడా టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది. ఇక ఆదివారం జరగబోయే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏ రేంజ్ లో జరగబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.