Begin typing your search above and press return to search.

మెరుగైన వైద్యం కోసం విదేశాల‌కు శ్రీతేజ్..

అయితే తాజాగా అల్లు అర్జున్ స‌న్నిహితుడు బ‌న్నీ వాస్ శ్రీతేజ్‌ను ప‌రామర్శించారు. శ్రీతేజ్ హెల్త్ కండిష‌న్ గురించి బ‌న్నీ వాస్ డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నాడు.

By:  Tupaki Desk   |   3 Feb 2025 3:30 AM GMT
మెరుగైన వైద్యం కోసం విదేశాల‌కు శ్రీతేజ్..
X

అల్లు అర్జున్ న‌టించిన పుష్ప‌2 సినిమా ప్రీమియ‌ర్ షో కు భారీ సంఖ్య‌లో ఫ్యాన్స్ త‌ర‌లిరావ‌డంతో థియేట‌ర వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోగా, త‌న కుమారుడు శ్రీ తేజ్ బాగా గాయ‌ప‌డ్డాడు.

తీవ్రంగా గాయ‌ప‌డ్డ శ్రీతేజ్‌ను సికింద్రాబాద్ కిమ్స్ కు త‌రలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు రెండు నెల‌లుగా శ్రీతేజ్ హాస్పిట‌ల్ లోనే ఉన్నాడు. స్పెష‌ల్ డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శ్రీతేజ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. బాలుడి ఆరోగ్య ప‌రిస్థితిని అల్లు అర్జున్, అల్లు అర‌వింద్, బ‌న్నీ వాస్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు.

శ్రీతేజ్ ట్రీట్మెంట్ కు అయ్యే ఖ‌ర్చంతా తామే భ‌రిస్తామ‌ని అల్లు అర్జున్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే తాజాగా అల్లు అర్జున్ స‌న్నిహితుడు బ‌న్నీ వాస్ శ్రీతేజ్‌ను ప‌రామర్శించారు. శ్రీతేజ్ హెల్త్ కండిష‌న్ గురించి బ‌న్నీ వాస్ డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్యం మెల్లిగా న‌య‌మ‌వుతుంద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో, ఇంకా మెరుగైన వైద్యం కోసం బాలుడిని విదేశాల‌కు తీసుకెళ్లాల‌ని బ‌న్నీ వాస్ డిసైడ్ అయ్యాడ‌ని తెలుస్తోంది.

ఈ దుర్ఘ‌ట‌నకు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ రేవ‌తి కుటుంబానికి పుష్ప‌2 చిత్ర యూనిట్ ఆర్థిక సాయం అందించింది. అల్లు అర్జున్ రూ.1 కోటి రూపాయ‌లు, డైరెక్ట‌ర్ సుకుమార్, నిర్మాత‌లు రూ.50 లక్ష‌లు చొప్పున మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. పుష్ప‌2 టీమ్ తో పాటూ శ్రీతేజ్ కుటుంబానికి ప్ర‌తీక్ ఫౌండేష‌న్ త‌ర‌పున తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి రూ.25 ల‌క్ష‌లు ఆర్థిక సాయం అందించారు.