Begin typing your search above and press return to search.

పుష్ప 2 రన్‌టైమ్?

పుష్ప 2 ఫైనల్ కట్ 3 గంటల 21 నిమిషాల నిడివితో సిద్ధంగా ఉందని సమాచారం. టాలీవుడ్‌లో ఇంత నిడివితో సినిమా రావడం చాలా సంవత్సరాల తరువాత జరుగుతోంది.

By:  Tupaki Desk   |   26 Nov 2024 4:48 PM GMT
పుష్ప 2 రన్‌టైమ్?
X

డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 ది రూల్ గురించి ప్రతి చిన్న విషయం సినీప్రేమికుల మధ్య చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా రన్‌టైమ్‌కి సంబంధించిన ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 ఫైనల్ కట్ 3 గంటల 21 నిమిషాల నిడివితో సిద్ధంగా ఉందని సమాచారం. టాలీవుడ్‌లో ఇంత నిడివితో సినిమా రావడం చాలా సంవత్సరాల తరువాత జరుగుతోంది.

ఇదే నిడివి బాలీవుడ్ మూవీ యానిమల్‌కు ఉన్నప్పటికీ, ఆ సినిమా ప్రేక్షకులను విసుగురాకుండా థియేటర్లో కట్టిపడేసింది. పుష్ప 2 కూడా ఇంతే నిడివితో వస్తే, అల్లు అర్జున్ అభిమానులకు నిజంగా పండుగే. అయితే, ఇంత పొడవైన రన్‌టైమ్‌తో మల్టీప్లెక్స్ షోలను షెడ్యూల్ చేయడం సవాలుగా మారవచ్చు. అయినప్పటికీ, యానిమల్ మాదిరిగా ప్రేక్షకులు దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నారు.

ప్రేక్షకులు మూడున్నర గంటల పాటు కథలో మునిగిపోవాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా కంటెంట్ పక్కాగా ఉండాలని భావిస్తున్నారు. ఏమాత్రం బోర్ కొట్టించినా కూడా మొదటికే మోసం వస్తుంది. టాక్ తేడాగా ఉంటే మాత్రం ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి రన్ టైమ్ అధికంగా ఉంటే ఎప్పటికైనా రిస్కె. రాజమౌళి కూడా బాహుబలి విషయంలో అలాంటి రిస్క్ చేయలేదు. RRR కు మాత్రం మల్టీస్టారర్ కాబట్టి 3 గంటల నిడివి తీసుకోక తప్పలేదు.

అయితే పుష్ప 2 స్థాయిలో బలమైన కథ, ఇంటర్వెల్ హైప్లో అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకముందు ఇలాంటి రన్‌టైమ్ తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2కి సానుకూలంగా సిద్ధమవుతున్నారు.

ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో జరుగుతుండటంతో, పుష్ప 2 మరింత క్రేజ్‌ను సంపాదిస్తోంది. ఫైనల్ కాపీ పనులను దర్శకుడు సుకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడంతో డిసెంబర్ 4న రాత్రి నుంచే ప్రీమియర్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్‌లో మునిగిపోయిన సినీప్రేమికులు ఇతర సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపడంలేదు.

జీబ్రా మినహా మరే కొత్త విడుదలలకూ పెద్దగా స్పందన లేదు. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ప్రభావం మొదటి షో నుంచే కనిపించనుంది. భారీ అంచనాలతో పుష్ప 2 సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా సాగుతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అవకాశముంటే, ప్రమోషన్లకు సంబంధించిన మరో అప్‌డేట్ లేదా ఫైనల్ రన్‌టైమ్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అయితే, ఇప్పటి వరకు లీకైన సమాచారం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని పెంచుతోంది.