వెకేషన్‌లో పుష్ప2 సక్సెస్‌ను ఎంజాయ్ చేయనున్న బన్నీ
ఇప్పుడు అన్ని విధాలా ఫ్రీ అయిపోయిన బన్నీ కొన్నాళ్ల పాటూ విదేశాల్లో తిరిగి అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి రావాలని వెళ్తున్నాడట.
By: Tupaki Desk | 9 Feb 2025 11:39 AM GMTగతేడాది డిసెంబరులో రిలీజైన పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి బాహుబలి2 రికార్డులు బ్రేక్ చేసింది. సినిమా అంత పెద్ద హిట్ అయినప్పటికీ బన్నీ ఆ సక్సెస్ ను సరిగా ఎంజాయ్ చేయలేకపోయాడు.
పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటన వల్ల బన్నీ సరిగా పుష్ప2 సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు. దేశం మొత్తం పుష్ప2 సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటే బన్నీ మాత్రం తన గార్డెన్ లో ఏం పాలుపోక దీనంగా కూర్చునేవాడని స్వయంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవిందే ఓసారి ప్రెస్‌మీట్ లో చెప్పిన విషయం తెలిసిందే.
రేవతి చనిపోవడం, శ్రీతేజ్ హాస్పిటల్ పాలవడం, బన్నీ అరెస్ట్ అవడం, తర్వాత బెయిల్ మీద బయటకు రావడం, బెయిల్ వచ్చినప్పటికీ ప్రతీ వారం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఇలా ఎన్నో అంశాలు బన్నీని ప్రశాంతత నుంచి దూరం చేశాయి. ఇప్పుడు ఫైనల్ గా బన్నీ మళ్లీ నార్మల్ అయినట్టు కనిపిస్తున్నాడు.
రీసెంట్ గా జరిగిన పుష్ప2 థ్యాంక్స్ మీట్ లో బన్నీ చాలా హుషారుగా, సంతోషంగా కనిపించాడు. పుష్ప2 లుక్స్ నుంచి బయటికొచ్చి మళ్లీ లవర్ బాయ్ గెటప్ లో కనిపించిన బన్నీ మొఖంలో సంతోషం చూసి రెండు నెలలైంది. పుష్ప2 ఈవెంట్ లో చిత్ర నిర్మాణానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పిన బన్నీ, తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి మిమ్మల్ని ఇంకా గర్వపడేలా చేస్తానన్నాడు.
అయితే గందరగోళం నుంచి బయటికొచ్చిన బన్నీ ఇప్పుడు పుష్ప2 సక్సెస్ ను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నాడట. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి పుష్ప2 రిలీజైన వెంటనే బన్నీ వెకేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు కానీ జరిగిన సంఘటనల నేపథ్యంలో బన్నీ అవన్నీ మానుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు అన్ని విధాలా ఫ్రీ అయిపోయిన బన్నీ కొన్నాళ్ల పాటూ విదేశాల్లో తిరిగి అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి రావాలని వెళ్తున్నాడట. ఇదిలా ఉంటే బన్నీ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని జానర్ లో ఈ సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.