ట్రైలర్ టాక్: పుష్ప అంటే ఫైర్ అనుకుంటిరా వైల్డ్ ఫైరు
పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా ఇంటర్ నేషనలు! అంటూ అతడి రేంజును ఒకే ఒక్క డైలాగ్ లో చెప్పకనే చెప్పాడు.
By: Tupaki Desk | 17 Nov 2024 1:10 PM GMTఒక ఇంటర్నేషనల్ స్టాండార్డ్ ఉన్న సినిమాని చూపించాలని అనుకుంటే, హీరోలోంచి వైల్డ్ ఫైర్ ని బయటికి లాగాలి. సుకుమార్ ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టుగా ఉంది. ఒక గంధపు చక్కల స్మగ్లర్ జీవితంలో వివిధ దశలను అతడు తెరపై ఆవిష్కరించేందుకు పుష్ప ఫ్రాంఛైజీని రన్ చేస్తున్నాడు. పుష్ప కు కొనసాగింపుగా ఇప్పుడు పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
ఈరోజు పూణేలో వ్యూహాత్మకంగా పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ ని ప్లాన్ చేయడం ద్వారా నార్త్ లో ఫైర్ రాజేసారనే చెప్పాలి. దిల్లీ, ముంబై, గుర్ గావ్ లాంటి ఎక్కువగా వినిపించే స్థలాల్లో కాకుండా పూణేలో ఈ ఈవెంట్ ని ప్లాన్ చేయడం వ్యూహాత్మకం. ఉత్తరాది మాస్ ని యూత్ ని థియేటర్లకు రప్పించే ప్రణాళిక ఇదని భావించాలి.
ఈ ఆదివారం సాయంత్రం మోస్ట్ అవైటెడ్ పుష్ప 2 ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం పుష్పరాజ్ గ్లింప్స్ ని ఎలివేట్ చేయడానికే సుకుమార్ ప్రాధాన్యతనిచ్చారు. ప్రతి ఫ్రేమ్ లో పుష్పలోని వైల్డ్ ఫైర్ ని పరిచయం చేసాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా ఇంటర్ నేషనలు! అంటూ అతడి రేంజును ఒకే ఒక్క డైలాగ్ లో చెప్పకనే చెప్పాడు. ఇక ట్రైలర్ లోని విజువల్స్ లో సెటప్ చూస్తుంటే నిజంగానే వీడు ఇంటర్నేషనల్ గంధపు చెక్కల స్మగ్లర్ అని అంగీకరించాలి. ఎవడు వీడు? వీడిలో తెలియని బాధ ఏదో ఉంది! అంటూ జగ్గూ భాయ్ పాత్రతో ట్రైలర్ ని పరిచయం చేసాక గంధపు చెక్కల స్మగ్లర్ల అడ్డాను భారీ సెటప్ తో చూపించారు. ఎటు చూసినా స్మగ్లర్ల అరాచకాలు ఆగడాలే కనిపిస్తున్నాయి.
పార్టీ ఉంది పుష్పా.. పార్టీ ఉంది! అంటూ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో తిరిగి వచ్చాడు ఫహద్ ఫాజిల్. ఫారెస్ట్ ఆఫీసర్ షెకావత్ తో పుష్పరాజ్ వార్ ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ ఆద్యంతం చూపించారు. సప్తసముద్రాలు దాటైనా తనకు దక్కాల్సినదానిని లాక్కుని వచ్చేవాడిగా పుష్పరాజ్ పాత్రను ఫుల్ ఫైర్ తో చూపించారు. ఈ సినిమాలో విజువల్స్ ఎంత భీకర పోరాటాలతో మైమరిపించబోతున్నాయో ట్రైలర్ రివీల్ చేసింది. అడవులు కొండల్లో భారీతనం నిండిన పోరాట సన్నివేశాలు పుష్పలో ఉన్నాయి. ఫారెస్టాఫీసర్ తో సిస్టమ్ తో పుష్ప రాజ్ పోరాటం ఏ లెవల్లో ఉందో తెరపై చూడాలి అనిపించేంతగా ట్రైలర్ లో అతడి పాత్రను ఎలివేట్ చేసాడు.
ఏడు కొండల మీద ఉన్నా ఏడు సముద్రాలు దాటెళ్లి అయినా పోయి తెచ్చుకునేదే పుష్పరా! అంటూ ఒక్క డైలాగ్ తో ఈ సినిమా థీమ్ ని ఎలివేట్ చేసారు. ఆఫీసర్ తో పుష్పరాజ్ వైల్డ్ పోరాటాలను ట్రైలర్ ఎలివేట్ చేసింది. ఇందులో పుష్పరాజ్ గా అతడి విభిన్నమైన గెటప్పులు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. పుష్ప 2 థియేటర్లలో ఏ రేంజులో వర్కవుటవుతుందో కాస్త వేచి చూడాలి. ఈ చిత్రంలో పుష్పరాజ్ భార్య పాత్రలో రష్మిక మందన నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించింది. దేవీశ్రీ- థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.