పుష్ప 3.. ఈ లీక్ ఊహించలేదే..!
ఐతే పుష్ప 3 కథ మొత్తం అల్లు అర్జున్ ఒక్కడే ఆ సిండికేట్ వ్యక్తులతో పాటుగా పోలీసులు, పొలిటికల్ లీడర్స్ ఇలా అందరితో ఫైట్ చేయాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 10 Dec 2024 2:30 PM GMTపుష్ప 2 బజ్ లో భాగంగా పుష్ప 3 ఎలా ఉంటుంది అంటూ సోషల్ మీడియా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా లీడ్స్ అండ్ క్లూస్ ని జోడిస్తూ కొందరు ఈ పనిలో ఉన్నారు. ఐతే పుష్ప 2 సినిమాలో షెకావత్ పాత్ర ఎండ్ అయినట్టుగా చూపించారు. అతను పట్టుకుంది అసలైన సరుకు కాదని పుష్ప రాజ్ ముందు ఓడిపోయిన బాధలో ఆ సండ్ర చెక్కల మధ్యలోనే కాలిపోయినట్టు షెకావత్ ని చూపిస్తారు. కాకపోతే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అతన్ని మరో పోలీసుల బృదం కాపాడుతుందని టాక్. ఆ సీన్ పుష్ప 2 నుంచి లేపేశారట.
అంతేకాదు పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ గా వచ్చిన దానిలో షెకావత్ ఒక ఒడ్డున ఆ రేడియో పెట్టుకుని చెరువులో స్నానం చేస్తాడు. ఆ విజువల్ ని బట్టి చూస్తే షెకావత్ పాత్ర కచ్చితంగా బ్రతికే ఉన్నట్టు లెక్క. ఆడియన్స్ దృష్టి మరల్చడం కోసం షెకావత్ మరణించినట్టు చూపించారు. అలా షెకావత్ పాత్ర ముగిస్తే అంత కన్నా పెద్ద కామెడీ ఏది ఉండదు. ఐతే పుష్ప 2 ఎండింగ్ లో ఫ్యామిలీ అంతటినీ బాంబ్ బ్లాస్ట్ చేయి చంపేస్తారు.
అందులో పుష్ప రాజ్ ఒక్కడే బ్రతికి పోలీసులు ఎలాగు తనని అరెస్ట్ చేస్తారని అడవుల్లోకి వెళ్తాడని తెలుస్తుంది. ఐతే పుష్ప 3 కథ మొత్తం అల్లు అర్జున్ ఒక్కడే ఆ సిండికేట్ వ్యక్తులతో పాటుగా పోలీసులు, పొలిటికల్ లీడర్స్ ఇలా అందరితో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఐతే పుష్ప 3 లో షెకావత్ పాత్ర ఉంటే మాత్రం అది ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఉంటుంది. ఇక పుష్ప 3 లో మళ్లీ పుష్ప రాజ్ లుక్ ఎలా ఉంటుంది. అందులో ఎలాంటి ట్విస్టులు ఉంటాయన్నది ఆ సినిమా వస్తేనే తెలుస్తుంది.
పుష్ప 3 ఎనౌన్స్ అయితే చేశారు కానీ అది చేయాలంటే మాత్రం మరో ఐదారేళ్లు కంపల్సరీ అంటున్నారు. పుష్ప 2 తర్వాత కొద్దిగా టైం తీసుకుని సుకుమార్, అల్లు అర్జున్ వేరే కమిట్మెంట్ తో ముందుకెళ్లనున్నారు. సో పుష్ప 3 అన్నది 2030కి వచ్చినా వచ్చినట్టే అని అంటున్నారు. పుష్ప 3 కన్నా ముందు సుకుమార్ చరణ్ తో సినిమా పూర్తి చేస్తాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో మరో భారీ సినిమా ప్లానింగ్ లో ఉంది.