ఫ్రాంఛైజీ నుంచి `పుష్ప 3 - పుష్ప 4` ప్లానింగ్?
అయితే ఫ్రాంఛైజీ నుంచి ఎన్ని సినిమాలు వస్తాయి? అన్నదానికి ఇంకా సరైన సమాధానం లేదు. నిన్న(08 ఫిబ్రవరి) థాంక్స్ మీట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప-3` గురించి ఆసక్తికర కామెంట్ చేసారు.
By: Tupaki Desk | 9 Feb 2025 6:50 AM GMTపుష్ప - పుష్ప 2 చిత్రాలతో దాదాపు 2200 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూలైంది. ఇది నిజంగా ఒక సంచలనం. బాహుబలి ఫ్రాంఛైజీలో బాహుబలి 1, బాహుబలి 2 సాధించిన వసూళ్ల (2460 కోట్లు)కు చేరువగా వచ్చింది పుష్ప ఫ్రాంఛైజీ. దేశంలోనే రెండో అతిపెద్ద బాక్సాఫీస్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ విజయాల స్ఫూర్తితో సుకుమార్ తదుపరి `పుష్ప 3`ని తెరకెక్కిస్తారని కథనాలొచ్చాయి.
అయితే ఫ్రాంఛైజీ నుంచి ఎన్ని సినిమాలు వస్తాయి? అన్నదానికి ఇంకా సరైన సమాధానం లేదు. నిన్న(08 ఫిబ్రవరి) థాంక్స్ మీట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప-3` గురించి ఆసక్తికర కామెంట్ చేసారు. పుష్ప 3 గురించి ఇంకా పూర్తి స్పష్ఠత లేదు. కానీ పుష్ప పేరు వింటేనే అదొక ఎనర్జీలా ఉందని బన్ని వ్యాఖ్యానించారు. ఇదే వేదికపై సుకుమార్ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించాయి. ఆయన మాటలను బట్టి ఈ ఫ్రాంఛైజీ అన్ లిమిటెడ్‌గా ముందుకు సాగనుంది.
``ఇప్పటివరకూ `పుష్ప` పూర్తి కథను చెప్పలేదు. `పుష్ప 2`తో సెకండ్ ఇంటర్వెల్ ఇచ్చాం. పుష్ప 3, పుష్ప 4 ఇలా ఎన్ని భాగాలు అవుతుందో చెప్పలేన``ని సుకుమార్ థాంక్స్ మీట్ లో అన్నారు. దీనిని బట్టి పుష్ప 3, పుష్ప 4 చిత్రాలతో ఇది ఆగిపోదు. పుష్ప 5, పుష్ప 6 కూడా ఉండొచ్చు. ఈ కథను ఎంత దూరం అయినా విస్తరించే అవకాశం ఉందని సుకుమార్ హింట్ ఇచ్చారు. నిజానికి టాలీవుడ్ లో అద్భుతమైన క్రియేటివ్ రయితలు, దర్శకులకు కొదవేమీ లేదిప్పుడు. శిష్య బృందంలో గొప్ప రచయితలు ఫ్రాంఛైజీని మరో స్థాయికి చేర్చడంలో సుకుమార్ కి సహకరిస్తారని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ కి ఇతర అగ్ర హీరోలతో కొన్ని కమిట్ మెంట్లు ఉన్నాయి. అలాగే బన్ని ఇతర దర్శకులకు ఇచ్చిన కమిట్ మెంట్లు పూర్తి చేయాలి. అవన్నీ పూర్తయ్యే క్రమంలో పుష్ప 3 ని కూడా పట్టాలెక్కించే వీలుంటుంది. 2026 ఆరంభం నాటికి `పుష్ప 3` స్క్రిప్టు కూడా రెడీ అయ్యే ఛాన్సుందని ఒక అంచనా.