బాక్సాఫీస్ వద్ద బన్నీ కొత్త చరిత్ర రాయబోతున్నాడా?
ఈనేపథ్యంలో డే1 వసూళ్లతో సరికొత్త రికార్డు లిఖించడానికి బన్నీ రెడీ అవుతున్నాడని విశ్వసనీయ సమాచారం.
By: Tupaki Desk | 29 Sep 2024 5:24 AM GMTబాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చరిత్ర రాయబోతున్నాడా? పుష్ప-2 తో అన్ని రికార్డులకు చెక్ పెట్టబోతున్నాడా? అంటే అవుననే ఇండస్ట్రీ వర్గాలు బలంగా విశ్వశిస్తున్నాయి. పుష్ప-2 డిసెంబర్ లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న భారీ అంచనాల మధ్యపాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకూ వెనక్కి తగ్గినా? ఇక తగ్గేదేలే బాక్సాఫీస్ వద్ద చూసుకుందాం అంటూ ప్రత్యర్ధులకు సవాల్ విసి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నాడు.
ఈనేపథ్యంలో డే1 వసూళ్లతో సరికొత్త రికార్డు లిఖించడానికి బన్నీ రెడీ అవుతున్నాడని విశ్వసనీయ సమాచారం. సినిమాకి ఉన్న బజ్ ని బేస్ చేసుకుని ఈ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకూ ఏనటుడికి సాధ్యం కానిది బన్నీకి జాతీయ స్థాయిలో సాధ్యమైన సంగతి తెలిసిందే. అదే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు. వీటన్నింటిని ఆధారం చేసుకునే `పుష్ప-2` డేవన్ వసూళ్లతో కొత్త చరిత్ర రాస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.
224 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద భారతీయ చిత్ర పరిశ్రమలోనే కొత్త రికార్డు నమోదు చేస్తుందనే అంచనాలు బల పడుతున్నాయి. అందుకు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్ని ప్రామాణికంగా తీసుకుని లెక్క గట్టినట్లు ఫిలిం సర్కిల్స్ భావిస్తోంది. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన `కల్కి 2898` తొలి రోజు 180 కోట్ల వసూళ్ల గ్రాస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన `దేవర` తొలి రోజు 172 కోట్ల గ్రాస్ సాధించింది.
దీంతో ఈరెండు సినిమాలు టాప్ -5 లో నిలిచాయి. అంతకు ముందు `ఆర్ ఆర్ ఆర్` చిత్రం తొలి రోజు 223 కోట్ల గ్రాస్ని సాధించింది. ఆ తర్వాత కల్కి..దేవర రెండు..మూడు స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడా స్థానాల న్నింటిని `పుష్ప-2 `బ్రేక్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతన్నాయి. ఆ సినిమా పై పాన్ ఇండియాలో ఉన్న అంచనాలు..బన్నీ క్రేజ్ తో ఆర్ ఆర్ ఆర్ వసూళ్లను సైతం వెనక్కి నెట్టి నెంబవర్ వన్ స్థానంలో కూర్చుంటుంది? అనే అంచనాలు బలపడుతున్నాయి.
`పుష్ప ది రైజ్` తొలి రోజు వరల్డ్ వైడ్ 73 కోట్ల గ్రాస్ సాధించింది. ఆ తర్వాత క్రమంగా ఉత్తారాది నుంచి వసూళ్లు ఊపందుకున్నాయి. పుల్ రన్ లో సినిమా 370 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అందులో మేజర్ షేర్ నార్త్ నుంచే ఉంది. అప్పటికి అదే అదే బన్నీ తొలి పాన్ ఇండియా రిలీజ్. తాజాగా నేషనల్ లెవల్లో బన్నీక్రేజ్ తో ఈ అంచనాలు తెరపైకి వస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.