పుష్ప రాజ్.. మరో స్ట్రాటజీ!
ఇదిలా ఉండగా 'పుష్ప 2'కి మరింత హైప్ తీసుకురావడం కోసం యూఎస్ లో 'పుష్ప' చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు.
By: Tupaki Desk | 12 Nov 2024 9:17 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా మొదటి రోజు ఈ మూవీ 200+ కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అన్ని భాషలలో కూడా షోలు హౌస్ ఫుల్ పడతాయని భావిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ ని మేకర్స్ షురూ చేశారు.
నవంబర్ 17న 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ ట్రైలర్ తో సినిమాపై హైప్ తారాస్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాలలో మెగా ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. సినిమాని పబ్లిక్ లోకి బలంగా పంపించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా 'పుష్ప 2'కి మరింత హైప్ తీసుకురావడం కోసం యూఎస్ లో 'పుష్ప' చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 19న యూఎస్ లో 'పుష్ప' మూవీ గ్రాండ్ గా రీరిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'పుష్ప 2' పైన భారీ హైప్ ఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఆడియన్స్ మరల 'పుష్ప' సినిమా చూడటానికి వస్తారని అనుకుంటున్నారు. అలాగే ఈ రీరిలీజ్ వలన 'పుష్ప 2'కి అదనపు అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు.
యూఎస్ లో అల్లు అర్జున్ కి పెద్దగా మార్కెట్ లేదు. అయితే 'పుష్ప' మూవీ అక్కడ మంచి వసూళ్లని అందుకుంది. కానీ ఈ సారి ఏకంగా 20+ మిలియల్ డాలర్స్ టార్గెట్ తో 'పుష్ప 2' యూఎస్ లో రిలీజ్ కాబోతోంది. ఈ టార్గెట్ ని అందుకోవాలంటే సినిమాని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయాల్సి ఉంది. అందుకోసమే 'పుష్ప' సినిమా ముని యూఎస్ లో రీరిలీజ్ చేస్తున్నారని టాక్. ఈ సినిమా రీరిలీజ్ అయ్యే అన్ని థియేటర్స్ లో 'పుష్ప 2' ట్రైలర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం.
దీని ద్వారా వీలైనంత ఎక్కువ మందిని 'పుష్ప 2' ని రీచ్ చేసే స్కోప్ దొరుకుతుంది. 'పుష్ప 2' తో ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాలనే లక్ష్యంతో మేకర్స్ ఉన్నారు. సినిమాని రైట్స్ ని భారీ ధరలకి అన్ని భాషలలో అమ్మేశారు. వాటిని రాబట్టాలంటే వీలైనన్ని ఎక్కువ రోజులు థియేటర్స్ లో మంచి వసూళ్లతో ఈ సినిమా నడవాల్సి ఉంటుంది. దేశంలో అత్యధిక థియేటర్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే యూఎస్ తరహాలో ఇండియాలో కూడా 'పుష్ప' సినిమా రీరిలీజ్ చేస్తే ఎంతో కొంత ప్లస్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. మరి మేకర్స్ ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తారా అనేది చూడాలి.