పుష్పపుష్ప.. వీడియో వచ్చేసింది
ఈ పాట కొన్ని గంటల్లోనే 5 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ డాన్స్ తో పాటు సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
By: Tupaki Desk | 18 Dec 2024 1:02 PM GMTవరల్డ్ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న పుష్ప 2 సినిమా పాటలు ఎంత పెద్ద హిట్‌గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రూ.1400 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిన పుష్ప 2 లాంగ్ రన్‌లో ఏ నెంబర్‌ను చేరుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా భారీ విజయం సాధించడంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఆయన పుష్ప 1 కి సైతం అద్భుతమైన పాటలను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు పుష్ప 2 తో మరోసారి దుమ్ము లేపుతూ దూసుకుపోతున్నాడు. పాటలన్నీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
సినిమా విడుదల తర్వాత ఒకొక్కటి చొప్పున వీడియో సాంగ్స్‌ను విడుదల చేస్తున్నారు. ఇటీవలే కిస్సిక్ కాంగ్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా పుష్పపుష్ప అంటూ సాగే టైటిల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. సినిమాలో పాట ఓ రేంజ్‌లో ఉంటుంది. పాటను అత్యంత భారీ ఖర్చుతో రూపొందించిన విషయం తెల్సిందే. పెద్ద ఎత్తున డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులు కనిపించే ఆ పాటను ఇప్పుడు వీడియో సాంగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ద్వారా సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా నకాష్ అజీజ్, దీపక్ బ్లూలు ఆలపించారు. పుష్ప సామ్రాజ్యం గురించి చెబుతూ సాగే ఈ పాట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. సినిమాలో అత్యంత కీలకమైన ఆ పాటను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సోషల్ మీడియాలో ఈ పాట కచ్చితంగా మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి స్పందన దక్కించుకోగా ఈ పాట అంతకు మించి అన్నట్లుగా యూట్యూబ్‌ని షేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ పాట కొన్ని గంటల్లోనే 5 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ డాన్స్ తో పాటు సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సుకుమార్ ఈ సినిమాను ఎంత భారీగా రూపొందించారో ఈ పాటను చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో సాధారణంగా హీరోయిన్స్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ ఈ పాటలో అల్లు అర్జున్ ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పుష్ప 2 సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా మరోసారి పుష్ప పుష్ప యూట్యూబ్‌లో ట్రెండ్ కాబోతుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ పాట వీడియో ను విడుదల చేయడం జరిగింది.