Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్‌ బట్టలు ఎక్కడ కొన్నాడు...?

ఆయన ధరించిన డ్రెస్‌ల్లో ఎక్కువ శాతం పోచంపల్లి చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   10 Dec 2024 5:30 PM GMT
పుష్ప రాజ్‌ బట్టలు ఎక్కడ కొన్నాడు...?
X

అల్లు అర్జున్‌ పుష్ప గురించి ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. ప్రపంచంలో ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు అంతా పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అనడంలో సందేహం లేదు. మొదటి అయిదు రోజులు పూర్తి కాకుండానే రూ.1000 కోట్ల వసూళ్లు నమోదు చేసి అత్యంత వేగంగా ఈ రికార్డ్‌ను సొంతం చేసుకున్న సినిమాగా పుష్ప 2 సినిమా నిలిచిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే నార్త్‌ ఇండియాలో సినిమా వసూళ్లు అత్యంధికంగా ఉన్నాయి. ఇలాంటి నెంబర్స్‌ను సౌత్‌ ఇండియాలో ఆశిస్తాం, కానీ నార్త్‌ ఇండియాలో అంతకు మించి వసూళ్లు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

బీహార్‌తో పాటు పలు నార్త్ రాష్ట్రాల్లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో నాలుగు రోజుల పాటు టికెట్లు దొరకని పరిస్థితి. అయిదవ రోజు అయిన సోమవారం సైతం చాలా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో టికెట్లు దొరకలేదు అనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పుష్ప 2 సినిమా జోరు మామూలుగా లేదు, లాంగ్‌ రన్‌లో సినిమా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. అలాగే దంగల్‌ రికార్డ్‌ను బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించిన విషయాలు, సినిమా కోసం వినియోగించిన సెట్‌ ప్రాపర్టీస్ సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెల్సిందే.

అల్లు అర్జున్‌ ఈ సినిమాలో విభిన్నమైన డ్రెస్‌లను ధరించాడు. ఆయన ధరించిన డ్రెస్‌ల్లో ఎక్కువ శాతం పోచంపల్లి చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. కంఫర్ట్‌తో పాటు నేచురల్‌గా ఉంటాయనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్‌ కోసం ఇక్కత్‌ సికో పట్టును పుష్ప రాజ్ డ్రెస్‌ల కోసం వినియోగించారు. అల్లు అర్జున్‌ పర్సనల్‌ డిజైనర్‌ ఈ ఫ్యాబ్రిక్‌ను ఎంపిక చేయడం జరిగింది. పుష్ప 2 సినిమా యొక్క కొన్ని సన్నివేశాలను పోచంపల్లి ప్రాంతాల్లో చేశారు. అల్లు అర్జున్‌ ఒకటి రెండు సార్లు వచ్చాడు అంటూ స్థానికులు చెబుతూ ఉంటారు.

ఇండియాస్ బిగ్గెస్ట్‌ మూవీగా నిలువబోతున్న పుష్ప 2 సినిమాకి పోచంపల్లితో రిలేషన్‌ ఉందని అక్కడి వారు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో అక్కడి వారు ఈ విషయాన్ని గురించి ప్రముఖంగా చర్చించుకుంటూ ఉన్నారు. రష్మిక మందన్నతో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు వాడిన కాస్ట్యూమ్స్‌లో కొన్నింటిని సైతం పోచంపల్లి నుంచి తీసుకోవడం జరిగింది. కొన్ని ముంబై నుంచి తీసుకోగా, కొన్ని రెగ్యులర్‌ షాప్స్ నుంచి తెప్పించారని సమాచారం అందుతోంది. మొత్తానికి పుష్ప రాజ్‌ ను విభిన్నంగా చూపించడంలో కాస్ట్యూమ్స్ కీలక పాత్ర పోషించాయి. అందుకే పోచంపల్లి వార్తల్లో నిలిచింది.