Begin typing your search above and press return to search.

క్రికెట్ గ్రౌండ్ లో పుష్ప రాజ్.. మెంటల్ మాస్ అంతే..!

ఇక ఈ సినిమా సాధించిన విజయోత్సవాన్ని మరింత పెంచేందుకు మేకర్స్ డిలీటెడ్ షాట్స్ రిలీజ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 11:26 AM GMT
క్రికెట్ గ్రౌండ్ లో పుష్ప రాజ్.. మెంటల్ మాస్ అంతే..!
X

పుష్ప 2 సినిమా థియేటర్ లో ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా రెండు వారాలుగా బాక్సాఫీస్ పై తన మార్క్ చూపిస్తుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబో సినిమా ఎలాంటి ట్రీట్ ఇస్తుందో మరోసారి సినీ ప్రియులకు పుష్ప 2 సూపర్ జోష్ అందిస్తుంది. పుష్ప 2 సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండటంతో అందుకు తగినట్టుగా వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 1500 కోట్లకు దగ్గరగా ఉంది. ఇక ఈ సినిమా సాధించిన విజయోత్సవాన్ని మరింత పెంచేందుకు మేకర్స్ డిలీటెడ్ షాట్స్ రిలీజ్ చేస్తున్నారు.

పుష్ప 2 సినిమా నుంచి టైటిల్ సాంగ్ లోని కొన్ని షాట్స్ ని లేటెస్ట్ గా వదిలారు. పుష్ప 2 లో మాస్ యాటిట్యూడ్ ని కొనసాగించేలా ఆ సాంగ్ లో మరికొన్ని షాట్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా క్రికెట్ గ్రౌండ్ లో పుష్ప రాజ్ వేషంలో అందరు కలిసి పుష్ప తో వేసే స్టెప్ అదిరిపోయింది. ఈ షాట్ ఎందుకు డిలీట్ చేశారో కానీ ఆ గ్రాండియర్.. ఆ మాస్ అప్పీల్ అదిరిపోయింది.

పుష్ప పుష్ప పుష్ప రాజ్ సినిమాలోని ఈ డిలీటెడ్ షాట్స్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. సుకుమార్ టేకింగ్ కి తగినట్టుగా అల్లు అర్జున్ యాక్టింగ్ కలిసి సినిమాను ఆ లెవెల్ లో నిలబెట్టాయి. పుష్ప 2 సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. సినిమా బాలీవుడ్ లోనే 600 కోట్లకు పరుగెత్తుతుంది అంటే సినిమా ఏ రేంజ్ లో అక్కడ ఆడియన్స్ కు రీచ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. పుష్ప 2 సినిమా తో అల్లు అర్జున్ అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. రెండు వారాలు అవుతున్నా పుష్ప 2 బాక్సాఫీస్ దూకుడు తగ్గలేదు. సినిమా ఫుల్ రన్ లో 2000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా సింగిల్ స్క్రీన్స్ లో సందడి బాగుంది. బీ,సీ సెంటర్స్ లో ఈ సినిమాను ఒక పండగలా చూస్తున్నారు. సినిమాకు ఎక్కువ మొత్తం వసూళ్లు కూడా ఈ ఏరియాల నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది.