టాలీవుడ్‌లో పుష్ప ట్రెండ్... 10 సినిమాలు అదే జోనర్‌లో!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' రెండు పార్ట్‌లు సెన్షేషనల్ సక్సెస్‌ని దక్కించుకున్నాయి.
By: Tupaki Desk | 13 Feb 2025 5:05 AM GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' రెండు పార్ట్‌లు సెన్షేషనల్ సక్సెస్‌ని దక్కించుకున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప అడవి బ్యాక్ డ్రాప్, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. సెకండ్ పార్ట్ అడవిలో ఎక్కువ సమయం లేకున్నా ఓవరాల్‌గా సినిమా కథ ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశం అనే విషయం తెల్సిందే. పుష్ప వచ్చిన జోనర్‌లోనే ఎక్కువ సినిమాలు రాబోతున్నాయి. కొన్ని సినిమాలు స్మగ్లింగ్ కథాంశంతో రూపొందుతూ ఉంటే, కొన్ని సినిమాలు ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్‌లో రూపొందబోతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సైతం ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుందనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఆఫ్రికన్ అడవుల్లో సినిమా కథ సాగుతుందనే వార్తలు వస్తున్నాయి. రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందబోతున్న సినిమా ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ సినిమా మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాలు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతున్నాయని తెలుస్తోంది. రాబోయే రెండేళ్ల కాలంలో దాదాపుగా పది సినిమాలు అదే జోనర్‌లో రాబోతున్నాయి.
అనుష్క హీరోయిన్‌గా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి సినిమా సైతం ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్‌తో రాబోతుంది. గంజాయి స్మగ్లింగ్ కథాంశంతో ఘాటి సినిమా సాగుతుందని సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఏప్రిల్ 18న సినిమాను థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. కన్నప్ప సినిమా సైతం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటుంది. మంచు విష్ణు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల విడుదలైన పాటను చూస్తే సినిమా ఫారెస్ట్‌లో ఎక్కువ షూట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇవే కాకుండా ఇంకా శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాను పల్లెటూరు నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కౌశిక్ పెగెల్లపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను సైతం థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో రూపొందిస్తున్నారు. ఇంకా పలు సినిమాల్లో ఏదో ఒక సీన్ లో లేదా కథలో ఫారెస్ట్‌ను భాగం చేయడం ద్వారా కొత్త ట్రెండ్‌ను మొదలు పెడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నారు. రాజమౌళి - మహేష్ బాబు సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన తర్వాత మరిన్ని సినిమాలు ఈ జోనర్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.