Begin typing your search above and press return to search.

పుష్ప 2 హిందీ.. 12 రోజుల కలెక్షన్లు ఎంత?

అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 11:07 AM GMT
పుష్ప 2 హిందీ.. 12 రోజుల కలెక్షన్లు ఎంత?
X

అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రత్యేకించి హిందీ వెర్షన్‌లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఊహించని రికార్డులను నమోదు చేస్తోంది. రెండో వారం పూర్తయినా కూడా ఈ సినిమా వసూళ్ల సునామీ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ట్రేడ్ విశ్లేషకులు ఈ చిత్రానికి పెద్దగా బ్రేక్ ఉండదని, త్వరలోనే రూ.600 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

విడుదలైన మొదటి రోజు నుంచే హిందీ బెల్ట్‌లో పుష్ప 2 రికార్డు స్థాయి వసూళ్లను అందుకుంది. తొలిరోజు రూ.75 కోట్ల గ్రాండ్ ఓపెనింగ్‌ను నమోదు చేసి, రెండో రోజైనా 59 కోట్లతో దూసుకెళ్లింది. శనివారం (Day 3) వసూళ్లు 74 కోట్లకు చేరుకోగా, ఆదివారం (Day 4) భారీగా పెరిగి రూ.86 కోట్లను రాబట్టింది. మొత్తం తొలి వారంలోనే కలెక్షన్లు 450 కోట్ల మార్కును దాటేసి, బాలీవుడ్‌లో మాసివ్ ఇంపాక్ట్ చూపించింది.

రెండో వారంలో కూడా పుష్ప 2 అద్భుతమైన హోల్డ్ చూపించింది. రెండో శుక్రవారం రూ.27.50 కోట్లను రాబట్టగా, శనివారం ఈ వసూళ్లు మరింత పెరిగి 46.50 కోట్లకు చేరాయి. ఇక ఆదివారం సినిమా రూ.54 కోట్ల గ్రాస్‌ను సాధించి, రెండో వారం చివరి రోజు కూడా మంచి స్ట్రాంగ్ ఫినిష్ ఇచ్చింది. సోమవారం అయినా హిందీ మార్కెట్‌లో ఈ సినిమా రూ.20.50 కోట్లను వసూలు చేయడం విశేషం.

ఇప్పటివరకు హిందీలో పుష్ప 2 వసూళ్లు రూ.582 కోట్ల నెట్ మార్కును దాటాయి. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాకుండా, పాన్ ఇండియా సినిమా హిస్టరీలో అరుదైన ఘనతగా నిలుస్తోంది. రెండో వారంలో సైతం బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగించడం సినిమాకి మరింత బలం చేకూరుస్తోంది. మునుపటి రికార్డులను అధిగమించి, కొత్త రికార్డుల వైపు దూసుకెళ్తున్న ఈ చిత్రం, హిందీ మార్కెట్లోకి మరిన్ని అవకాశాలను తెరిచినట్లయింది.

1వ రోజు - 75CR

2వ రోజు - 59CR

3వ రోజు - 74CR

4వ రోజు - 86CR

5వ రోజు - 48CR

6వ రోజు - 36CR

7వ రోజు - 31.50CR

8వ రోజు - 27CR

9వ రోజు - 27.50CR

10వ రోజు - 46.50CR

11వ రోజు - 54CR

12వ రోజు - 20.50CR

12 రోజుల టోటల్ హిందీ కలెక్షన్లు - 582 కోట్లు

ఈ కలెక్షన్లతో పుష్ప 2 హిందీ వెర్షన్ రూ.600 కోట్ల క్లబ్‌కు చేరుకోవడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. రెండో వారంలో సాధించిన వసూళ్లను చూస్తే, సినిమా లాంగ్ రన్‌లో మరింత భారీ వసూళ్లను అందుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా, బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాల రికార్డులను బ్లాస్ట్ చేస్తోంది. అల్లు అర్జున్ మాస్ పర్ఫార్మెన్స్, సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కలిసివచ్చి పుష్ప 2ను సెన్సేషనల్ హిట్‌గా నిలిపాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ పాపులారిటీ ఈ సినిమా ద్వారా మరింత పెరిగింది. పుష్ప 2 కలెక్షన్లు చూసి బాలీవుడ్ పెద్దలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమా ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.